వెల్లంపల్లికి ఇరకాటం?: వైసీపీలో చేరిన సీనియర్ కాపు నేత- కన్నాకు సన్నిహితుడిగా..

సార్వత్రిక ఎన్నికలకు ఇంకో ఏడాది మిగిలివుండగానే- చేరికల వేడి రాజుకుంది. ఇవ్వాళ కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరగా.. కాంగ్రెస్ పార్టీ సీినియర్ నేత ఆకుల శ్రీనివాస్ వైసీపీ కండువా కప్పుకొన్నారు.

విజయవాడ: విజయవాడ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆకుల శ్రీనివాస్- రంగ ప్రవేశం చేశారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొద్దిసేపటి కిందటే ఆయన తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. కండువాను కప్పి ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్.

కాంగ్రెస్ అభ్యర్థిగా..

కాంగ్రెస్ అభ్యర్థిగా..

కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు పని చేసిన అనుభవం ఉంది ఆకుల శ్రీనివాస్ కు. విజయవాడ రాజకీయాలపై మంచిపట్టు ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీతో పెద్దగా అంటీముట్టనట్టే వ్యవహరిస్తోన్నారు. పార్టీ అధిష్ఠానం గిడుగు రుద్రరాజుకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పగ్గాలను అప్పగించిన తరువాత కూడా ఆయన అటు వైపు మొగ్గు చూపలేదు.

 అనూహ్యంగా వైసీపీలోకి..

అనూహ్యంగా వైసీపీలోకి..

ఈ పరిణామాల మధ్య ఆయన రాజకీయాల నుంచి తప్పుకొంటారనే ప్రచారం విజయవాడలో జరిగింది. అనూహ్యంగా వైఎస్ఆర్సీపీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆకుల శ్రీనివాస్ రాకతో విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో కీలకమైన మార్పులు చేర్పులు ఉండొచ్చనే ప్రచారం కూడా ఇప్పుడిప్పుడు ఊపందుకుంటోంది.

వెల్లంపల్లికి చెక్..

వెల్లంపల్లికి చెక్..

విజయవాడ వెస్ట్.. దేవాదాయ శాఖ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సొంత నియోజకవర్గం. ఇక్కడి నుంచి ఆయన రెండుసార్లు విజయం సాధించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. 2014లో బీజేపీ టికెట్ పై పోటీ చేసి ఓటమి చవి చూశారు. ఆ తరువాత వైఎస్ఆర్సీపీలో చేరారు. 2019 నాటి ఎన్నికల్లో విజయం సాధించారు. వైఎస్ జగన్ కేబినెట్ లో బెర్త్ దక్కించుకోగలిగారు. అదే నియోజకవర్గానికి చెందిన సీనియర్ ఆకుల శ్రీనివాస్ ను వైసీపీలో చేర్చుకోవడం చర్చనీయాంశమౌతోంది.

సామినేని- వెల్లంపల్లి మధ్య

సామినేని- వెల్లంపల్లి మధ్య

ఇదే ఆకుల శ్రీనివాస్ విషయంలో కొద్దిరోజుల కిందటే వెల్లంపల్లి శ్రీనివాస్- సామినేని ఉదయభాను మధ్య వాగ్యుద్ధం తలెత్తిన విషయం తెలిసిందే. తన నియోజకవర్గానికి చెందిన ఆకుల శ్రీనివాస్ ను సామినేని ఉదయభాను తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి తీసుకెళ్లడాన్ని వెల్లంపల్లి ప్రశ్నించారు. కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచీ ఆకుల శ్రీనివాస్ తో మంచి సంబంధాలు ఉన్నాయని వివరణ ఇచ్చుకున్నారప్పట్లో. ఇద్దరి మధ్యా వివాదానికి దారి తీసిందీ వ్యవహారం.

స్వాగతించిన వెల్లంపల్లి..

స్వాగతించిన వెల్లంపల్లి..

కాగా- ఆకుల శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీలో చేరడంపై వెల్లంపల్లి స్పందించారు. ఆయన రాకను స్వాగతిస్తోన్నానని అన్నారు. ఆకుల చేరిక పట్ల తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని పేర్కొన్నారు. గతంలో సామినేని ఉదయభానుతో తలెత్తిన వివాదం- తనకు సమాచారం ఇవ్వకపోవడం వల్లేనని వివరణ ఇచ్చారు. కాపు సామాజిక వర్గానికి జగన్ చేస్తోన్న మేలును చూసి ఆయన తమ పార్టీలో చేరారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో ఆకుల శ్రీనివాస్ కు అటు కన్నా లక్ష్మీనారాయణతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+