Sujana Chowdary: ఎన్నికల వేళ సుజనా చౌదరికి షాక్..! రూ.500 కోట్ల రుణంపై...

ఏపీ బీజేపీ సీనియర్ నేత, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సుజనా చౌదరికి తాజాగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఆయన కంపెనీలు రుణాల ఎగవేత కేసుల్ని ఎదుర్కొంటుండగా.. ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా కూడా ఇబ్బందుల్లో పడ్డారు. గతంలో ఓ కంపెనీకి రూ.500 కోట్ల రుణం తీసుకునేందుకు ఎస్బీఐకి గ్యారంటీ ఇచ్చిన సుజనా చౌదరి.. ఇప్పుడు ఆ కంపెనీ దివాలా తీయడంతో వ్యక్తిగతంగా బాధ్యులు కాబోతున్నారు.

స్ప్లెండిడ్ మెటల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సంస్ధ స్టేట్ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.500 కోట్ల రుణానికి బీజేపీ నేత సుజనా చౌదరి గతంలో వ్యక్తిగత గ్యారంటీ ఇచ్చారు. అయితే ఈ రుణాన్ని సదరు సంస్ధ తిరిగి చెల్లించకపోవడంతో దివాలా ప్రక్రియకు అనుమతించాలని హైదరాబాద్ లోని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ ను ఆశ్రయించి. అయితే సంస్ధ కాకుండా ఈ రుణానికి గ్యారంటీ ఇచ్చిన సుజనాపై దివాళా పరిష్కార ప్రక్రియ ప్రారంభించేందుకు అనుమతించాలని ఎన్సీఎల్టీని ఎస్బీఐ కోరింది.

setback to ap bjp leader sujana chowdary as nclt allowed insolvency proceedings against him

కానీ సుజనా లాయర్ మాత్రం కంపెనీ తీసుకున్న రుణానికి వ్యక్తిగతంగా బాధ్యుడిని చేయడం సరికాదని వాదించారు. అయితే జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ మాత్రం సుజనా చౌదరి వ్యక్తిగత హోదాలో ఇచ్చిన రుణ గ్యారంటీకి ఆయననే బాధ్యుడిని చేస్తూ ఆయనపై దివాళా పరిష్కార ప్రక్రియ ప్రారంభించేందుకు అనుమతి మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ సుజనా చౌదరిపై దివాళా పరిష్కార ప్రక్రియ ప్రారంభించబోతోంది. దీని వల్ల సుజనాకు భారీగా ఇబ్బందేమీ లేకపోయినా ఎన్నికల వేళ విపక్షాలకు ఈ వ్యవహారం అస్త్రంగా మారనుంది.

స్ప్లెండిడ్ మెటల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి తీసుకున్న రూ. 500 కోట్ల రుణానికి సుజనా చౌదరి వ్యక్తిగత హామీ ఇచ్చారు. డిఫాల్ట్‌గా, సుజనా చౌదరిపై వ్యక్తిగత దివాలా మరియు దివాలా చర్యలను ప్రారంభించడానికి SBI 2021లో NCLTలో పిటిషన్‌ను దాఖలు చేసింది. చౌదరి ఆస్తుల మదింపును చేపట్టాలని, వాటిని వేలం వేసి రుణాలు చెల్లించాలని ఎస్‌బీఐ కోరింది. ఈ పిటిషన్‌పై జ్యుడీషియల్ సభ్యుడు రాజీవ్ భరద్వాజ్, టెక్నికల్ సభ్యుడు సంజయ్ పూరీలతో కూడిన ఎన్‌సిఎల్‌టి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయవాది వి.వి.ఎస్.ఎన్. పిటిషనర్ తరఫున రాజు వాదనలు వినిపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+