యువకుడిపై సెక్స్ వర్కర్ మధుమిత దాడి: రెచ్చగొట్టి తీసుకెళ్లి.. చివరికిలా!..

Subscribe to Oneindia Telugu

నెల్లూరు: రోడ్డుపై ఉన్న ఓ యువకుడికి వ్యభిచారిణి వల వేసింది. కన్నుగీటి రెచ్చగొట్టింది. వ్యభిచారిణి అసలు మర్మం ఎరుగని యువకుడు.. ఆత్రుతగా ఆమె వద్దకు వెళ్లాడు. సమీపంలోని ఓ ఖాళీ స్థలం వద్దకు అతడిని తీసుకెళ్లిన యువతి.. ఉన్నదంతా దోచుకుని ప్రియుడితో దాడి చేయించి పంపించింది.

  GST Effect On $ex Workers | Oneindia Telugu

  శుక్రవారం నాడు ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని గుప్తా పార్కు నారాయణరావు పేటకు చెందిన ఎన్.చిరంజీవి ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. అక్టోబర్ 29వ తేదీ రాత్రి అతను పనులు ముగించుకుని ఇంటికి బయలుదేరాడు.

  sex worker attacks man and escaped with money

  రాత్రి 11గం. సమయంలో కనకమహాల్ సెంటర్ వద్ద వాహనం కోసం ఎదురుచూస్తూ నిలబడ్డాడు. ఇంతలో సెక్స్ వర్కర్ మధుమతి అటువైపుగా వచ్చి అతనితో మాటలు కలిపింది. అతన్ని ఒప్పంచి కనకమహాల్ థియేటర్ సమీపంలోని ఖాళీ స్థలం వద్దకు తీసుకెళ్లింది.

  అప్పటికే ఆమె సహచరుడు మస్తాన్ అక్కడ మాటు వేసి ఉన్నాడు. ఇద్దరు కలిసి చిరంజీవిపై దాడి చేసి అతని వద్దనున్న రూ.30వేల నగదును దోచుకెళ్లారు. గాయపడ్డ చిరంజీవి ఈ విషయం బయటకు పొక్కితే పరువుకు భంగం అని ఆలోచించాడు.

  తనలో తానే కుమిలిపోతున్న అతను.. శనివారం తన స్నేహితునికి జరిగిన విషయం చెప్పాడు. దీంతో మూడో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Chiranjeevi, A nellore man was attacked by sex worker and looted while he returning from work

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి