Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్నానం చేస్తున్న విద్యార్థినుల న్యూడ్ వీడియోలతో కీచక అధ్యాపకుడి కామలీలలు!!

విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన అధ్యాపకులు కీచకులుగా మారుతున్నారు. చదువు చెప్పాల్సిన అధ్యాపకులు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా విద్యార్థినుల న్యూడ్ వీడియోలను చూస్తూ వారిని లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారు కొందరు కీచక అధ్యాపకులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఈ దారుణ ఘటనల వివరాలలోకి వెళితే ...

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న, లైంగిక వేధింపులకు గురి చేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక కీచక అధ్యాపకుడు ముగ్గురు విద్యార్థినులను లైంగికంగా వేధించాడు. నీ చదువు బాధ్యత నాదే.. నీకు ఉద్యోగం వచ్చే వరకు ఖర్చు అంతా నేనే భరిస్తా అంటూ విద్యార్థినులకు మాయమాటలు చెప్పి నమ్మించాడు.

sexual assault of a lecturer on students with nude bath videos of female students in AP

సదరు అధ్యాపకుడి మాటలు నమ్మి ఆపై అతను చెప్పినట్టు చేశారు. ఒకరు కాదు ఏకంగా ముగ్గురు విద్యార్థినులు సదరు కీచక అధ్యాపకుడి చేతిలో మోసపోయారు. విద్యార్థినులతో చాటింగ్ చేస్తూ వారిని "నీ స్నానం చేసే వీడియోలు పంపు చూస్తా" అంటూ అడిగి ఆపై వీడియోలు చూపి విద్యార్థినులను బెదిరిస్తూ వారిని లైంగికంగా ఇబ్బంది పెడుతున్న అధ్యాపకుడి విషయంలో విద్యార్థినులు భయపడుతున్నారు

. ఎవరికీ చెప్పలేక లోలోపల కుమిలిపోతున్నారు. కళాశాల యాజమాన్యం పట్టించుకోకపోవటంతో దిక్కు తోచని స్థితిలో పడ్డారు. ఎవరికైనా ఈ విషయం చెప్తే ఫోటోలు, వీడియోలు బయటకు వస్తాయంటూ బెదిరింపులకు గురి చేస్తున్నాడు ఆ అధ్యాపకుడు. దీంతో సంబంధిత అధికారులు, పోలీసులు కీచక అధ్యాపకుడిపై చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థినులు కోరుతున్నారు.

ఇక ఈ ఒక్క అధ్యాపకుడే కాదు మరో ఇద్దరు కూడా ఇదే తరహాలో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, లైంగికంగా వేధిస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతుంది. ఇక ఈ కళాశాలలో గంజాయికి విద్యార్థులు అలవాటు పడుతున్నారన్న చర్చ కూడా జరుగుతుంది. ఏది ఏమైనా పాఠాలు చెప్పాల్సిన టీచర్లు చేస్తున్న ఈ పాడు పనులపై ఇప్పటికైనా అధికారులు దృషి పెట్టాలని, వారిపై చర్యలు తీసుకోవాలని పుట్టపర్తిలో స్థానికంగా ఉన్నవారు డిమాండ్ వినిపిస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+