షారుక్ ఖాన్ కు ఘోర ప్రమాదం
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ గురించి షాకింగ్ న్యూస్ వస్తోంది. షూటింగ్ కోసం అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌కు వెళ్లి అక్కడ ప్రమాదానికి గురయ్యారు అని. తర్వాత అతను శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారని సమాచారం. షారుక్ ముక్కులో గాయం కారణంగా రక్తస్రావం ప్రారంభమవగా చిన్న ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ బాద్ షా ఇండియా చేరుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. గాయం నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది.
షారుక్ లాస్ ఏంజిల్స్‌లో ఒక ప్రాజెక్ట్ కోసం షూటింగ్ చేస్తున్నారు. ముక్కుకు గాయమై రక్తస్రావం అవుతుండటంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆందోళన చెందాల్సిన పని లేదని తెలిపిన వైద్యులు రక్తస్రావం ఆపడానికి చిన్న శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ తర్వాత షారుక్ కట్టుతో కనిపించారు.

ఈ సంవత్సరం పఠాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు షారుక్. సినిమా విడుదలైన ప్రతిచోటా సంచలన విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.1000 కోట్లు వసూలు చేసింది. దీని తర్వాత సినిమాగా జవాన్ చేస్తున్నారు. ఈ నెలలోనే ట్రైలర్ విడుదల కాబోతోంది. జులై 12న విడుదల చేయొచ్చని సమాచారం. అట్లీ దర్శకత్వం వహించారు. నయనతార, విజయ్ సేతుపతి ఇతర తారాగణం. ఈ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్, గౌరీఖాన్ నిర్మించారు. దీనితర్వాత రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో ఓ సినిమాలో డాంకీ చేస్తున్నారు. విక్కీ కౌశల్, తాప్సీ పన్ను కూడా నటించారు. టామ్ క్రూజ్ నటించిన హాలీవుడ్ సినిమా మిషన్ ఇంపాజిబుల్ సినిమాతోపాటు థియేటర్లలో ఈనెల 12వ తేదీన జవాన్ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు.












Click it and Unblock the Notifications