ఆమె బీకాం లో ఫిజిక్స్ చదవలేదట .. బీజేపీ అభ్యర్థి నటి మాధవీ లత సెటైర్
ఏపీలో ఎన్నికల వేళ సీనియర్ నాయకులే కాదు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారు సైతం ఏ మాత్రం తగ్గటం లేదు .పదునైన వాగ్బాణాలను సంధిస్తున్నారు. ఆ కోవలోనే ఉన్నారు సినీనటి, బీజేపీ గుంటూరు వెస్ట్ అభ్యర్థి మాధవీలత . ఆమె సైతం ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఉన్నత చదువులు చదివిన తాను ప్రజా సమస్యలను పరిష్కరించటంలో ముందుంటానని తనకు అవకాశం ఇవ్వమని కోరుతుంది. తాను ఈ ఎన్నికల్లో గెలిచినా,ఓడినా ప్రజలతోనే ఉంటానని చెప్తున్నారు మాధవీ లత .ప్రజా సమస్యలను అర్థంచేసుకునే మనసుంటే రాజకీయాల్లో రాణించడం పెద్ద కష్టమేమీ కాదని మాధవీలత అంటున్నారు.

తానూ బీకాం లో ఫిజిక్స్ చదువుకోలేదు అన్న మాధవీలత
ఇక ఆమె అక్కడ రాజకీయ నాయకులను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు . తాను ఇక్కడి నాయకుల్లాగా బీకాంలో ఫిజిక్స్ చదవుకులేదంటూ సెటైర్లు వేశారు. ప్రాంతీయ పార్టీల్లో ఉండే కంటే జాతీయ పార్టీలో ఉండటం మంచిది అని భావించే తాను బీజేపీ వంటి జాతీయ పార్టీలో చేరానని చెప్పుకొచ్చారు. ఇక ఏపీలో ప్రస్తుతం ఉన్న ప్రాంతీయ పార్టీలలో నైతిక విలువలు ఉన్న పార్టీలు ఏమీ లేవని చెప్పుకొచ్చారు.

బీజేపీ జాతీయ పార్టీ .. గుంటూరు ప్రజలు తనను ఆదరిస్తారంటున్న మాధవీలత
బీజేపీ తనకే కాదు తన కుటుంబానికి కూడా బీజేపీ చాలా దగ్గరైన పార్టీ అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జిల్లాల కంటే విలక్షణమైన స్వభావం గుంటూరు రాజకీయాలకు ఉంటుందని, గుంటూరు ప్రజలు తప్పక తనను ఆదరిస్తారని ఆమె పేర్కొన్నారు. తనకు రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు నటి , గుంటూరు వెస్ట్ బీజేపీ అభ్యర్థి మాధవీ లత.

సినీపరిశ్రమలోని వారంతా మంచి వారు .. సేవ చెయ్యాలని వచ్చాను ఆదరించండి అంటున్న మాధవీలత
ఇక సినీ పరిశ్రమను ఉద్దేశించి మాట్లాడిన ఆమె సినిమా పరిశ్రమలోని వాళ్ళంతా మంచివారేనని కితాబిచ్చారు . సినీ పరిశ్రమ నుండి రాజకీయాల్లోకి వచ్చే వారికి ప్రజల కోసం పని చెయ్యాలన్న భావన వుంటుంది కానీ దోచుకోవాలనే భావన ఉండదు అని మాధవీలత చెప్పారు. తనకు ప్రజాక్షేత్రంలో ఎలాంటి ఇబ్బంది ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటానని తెలిపిన ఆమె టీడీపీ నాయకులకే బీకాం లో ఫిజిక్స్ అంటూ పంచ్ వేశారు .
-
తమిళనాడు, బెంగాల్ ఎన్నికల వేళ.. కీలక పరిణామం- బీజేపీకి బూస్ట్ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్












Click it and Unblock the Notifications