Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ సర్కార్ కు షాక్ .. జీవో నంబర్ 15 సస్పెండ్ చేసిన హైకోర్టు .. మధ్యంతర ఉత్తర్వులు

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ కాలేజీలలో ఫీజులను తగ్గించేందుకు నిర్ణయం తీసుకుని ఫీజులను నిర్ణయం చేసింది .ఇక ఈ నేపధ్యంలో జీవో నంబర్ 15 ద్వారా గతంలో కన్నా తక్కువగా ఫీజులను నిర్ణయించింది . విద్య కోసం ఖర్చు చేసే వ్యయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుని ఫీజులను నిర్ణయిస్తామని ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య స్పష్టం చేసిన నేపధ్యంలో ఆ విధంగానే ఫీజులను తగ్గించింది. ఇక దీనిపై ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది .

ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులను నిర్ణయిస్తూ, గతం కంటే తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు ఎపీలోని పలు ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలు . ఇక దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 15ను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ చేసిన సిఫార్సుల మేరకు రాష్ట్రంలో వివిధ ఇంజనీరింగ్ కళాశాలలకు ఫీజులను నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Shock to AP govt .. G.O No 15 Suspended High Court .. Interim Orders issued

ఈ ఉత్తర్వులతో తమకు తీరని నష్టం జరుగుతుందని, ఇక వీటిని సవాల్ చేస్తూ 23 ఇంజనీరింగ్ కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. తమ కళాశాల ఫీజు నిర్ణయం సహేతుకంగా లేదని పిటిషన్‌లో కళాశాలల యాజమాన్యాలు పేర్కొన్నాయి. ఇక ఇంజినీరింగ్ కళాశాలల నిర్వహణలో ఉన్న సాధక బాధకాలను హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్ళారు కళాశాలల యాజమాన్యాలు . ఈరోజు హైకోర్టులో కళాశాలల యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరగ్గా జీవోను సస్పెండ్ చేస్తూ హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Recommended Video

    AP CM Jagan Launched Fishermen Bharosa Scheme, Rs 10,000 To Beneficiaries

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+