Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబుకు, టీ కాంగ్రెస్ కు షాక్..కేంద్రంలో కాంగ్రెస్ కు మద్దతివ్వాలని కేసీఆర్ కు లేఖ రాసిన రఘువీరా

ఏపీలో ఎన్నికలు ముగిసినా నేతల సంచలనాలు, ఆసక్తికర వ్యాఖ్యలతో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది .ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిస్తే , ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మాత్రం చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తున్న కేసీఆర్ కు కేంద్రంలో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వండి అంటూ లేఖ రాసి సంచలనం సృష్టించారు .

సంచలనంగా మారిన రఘువీరా లేఖ .. కేంద్రంలో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ ను కోరిన రఘువీరా

సంచలనంగా మారిన రఘువీరా లేఖ .. కేంద్రంలో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ ను కోరిన రఘువీరా

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి రాసిన సంచలన లేఖ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. తొలుత ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపిన కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన రఘువీరారెడ్డి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని తెలంగాణా సీఎం కేసీఆర్ ను కోరారు. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీకి మద్దతు ఇవ్వొద్దన్న ఆయన కేంద్రంలో తమతో కలిసి ముందుకు రావాలని లేఖలో పేర్కొన్నారు.

ప్రత్యేక హోదాకు మద్దతిస్తే కాంగ్రెస్ తో జత కట్టండి అన్న రఘువీరా

ప్రత్యేక హోదాకు మద్దతిస్తే కాంగ్రెస్ తో జత కట్టండి అన్న రఘువీరా

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించిందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాపైనే తొలి సంతకమన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఈ సందర్భంగా రఘువీరా గుర్తు చేశారు. నిజంగా ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతిస్తే కాంగ్రెస్ పార్టీతో కలిసిరావాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు కూడా మద్దతు తెలపాలని కోరారు.

రఘువీరా లేఖతో చంద్రబాబు,టీ కాంగ్రెస్ షాక్ ..

రఘువీరా లేఖతో చంద్రబాబు,టీ కాంగ్రెస్ షాక్ ..

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాసిన లేఖతో తెలంగాణా కాంగ్రెస్ శ్రేణులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య బద్ధ శత్రుత్వం కొనసాగుతున్న వేళ కేంద్రంలో కాంగ్రెస్‌కు మద్దతివ్వాలంటూ రఘువీరారెడ్డి రాసిన లేఖ తెలంగాణా కాంగ్రెస్ నాయకుల అసహనానికి కారణం అవుతుంది. ఒకపక్క గులాబీ సర్కార్ తో పోరాడుతుంటే మరోపక్క కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వమని అడగటం రఘువీరా అవివేకం అన్న భావన కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తం అవుతుంది. ఇక చంద్రబాబును సైతం రఘువీరా లేఖ షాక్ కు గురి చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+