భోజనాలున్నాయమ్మా వెళ్లొద్దు.. విజయసాయికి షాక్.. ఇజ్జత్ తీసిన టీడీపీ!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. అన్ని ప్రధానపార్టీలు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా క్షేత్రంలోకి వెళుతున్నాయి. ఇక తాజాగా ఎన్నికల ప్రచారంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఘోర పరాభవం ఎదురైందని టిడిపి ఒక వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో ద్వారా వైసిపికి ప్రజల ఆదరణ లేదని, ప్రజలను బ్రతిమిలాడుకుంటూ వైసిపి పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు అని చెప్పడానికి టిడిపి ప్రయత్నించింది.
నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న విజయసాయిరెడ్డి ఎన్నికల ప్రచారంలో సీతారాంపురంలో ప్రచార రథం పై నుండి ప్రసంగించడానికి రెడీ అయిన సమయంలో ఒక్కసారిగా జనం అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. ఇక కార్యకర్తలు కూడా వెళ్ళిపోతున్న క్రమంలో ప్రచార రథం పై ఉన్న నాయకులు ప్రజలను వెళ్ళొద్దని విజ్ఞప్తి చేశారు.

విజయసాయిరెడ్డి ప్రసంగించే వరకు ఆగాలని స్థానిక ప్రజలను, కార్యకర్తలను విజ్ఞప్తి చేయడం, భోజనాలు కూడా ఏర్పాటు చేశామని తిని వెళ్లాలని కోరడం జరిగింది. ఇక ఈ వీడియోను తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది. వైసిపి నాయకులు ఎంత బతిమాలినా పాపం ఎవరూ వారి మాట వినలేదని పేర్కొంది.
భోజనాలు ఉన్నాయి, బిర్యానీ పెడతాం వెళ్ళకండి అంటున్నా, ప్రజలు వైసీపీ నేతల మొఖాన ఛీ కొట్టి వెళ్ళిపోతున్నారు. ఉదయగిరి ప్రజలు, ఏ2 విజయసాయి రెడ్డిని కనీసం పట్టించుకోవటం లేదు. ఇక జగన్ సంగతి అయితే సరే సరి.. పులివెందులలోనే తుస్సుమంది. జగన్, నీ పని అయిపోయింది 😂#EndOfYCP#YCPAntham… pic.twitter.com/Dc1FjIVQZ6
— Telugu Desam Party (@JaiTDP) March 29, 2024
అందరూ ఆగాలని అందరికీ భోజనాలు ఏర్పాటు చేశామని, పెద్దాయన మాట్లాదేవరకు వెళ్లొద్దు అంది, ప్రచార రథం పై ఉన్న నేత మైకు పట్టుకుని మరీ ప్రకటించినా వినకుండా వెళ్ళిపోయారని, చెప్పేది వినండి.. వెనక్కి రావాలి అని, దయచేసి వెళ్ళొద్దని ప్రాధేయపడినా జనాలు మాత్రం వెళ్లిపోయారని టిడిపి ఆ వీడియోతో వైసీపీని టార్గెట్ చేసింది.
ఏ 2 విజయసాయిరెడ్డిని ఉదయగిరి ప్రజలకు కనీసం పట్టించుకోవడంలేదని, భోజనాలు ఉన్నాయి.. బిర్యానీ పెడతాం వెళ్ళకండి అన్నా వైసిపి నేతల ముఖాన్ని చీకటితో వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేసింది. ఇక జగన్ సంగతి కూడా అదే విధంగా ఉందని పేర్కొంది. పులివెందులలో జగన్ పర్యటన తుస్సుమంది అని పేర్కొన్న టిడిపి జగన్ పని కూడా అయిపోయింది అంటూ ఆ వీడియోతో పాటు చేస్తూ పోస్ట్ పెట్టింది












Click it and Unblock the Notifications