హెయిర్ డై తాగి నలుగురు విద్యార్థినుల ఆత్మహత్యా యత్నం.. ఏపీలో షాకింగ్ ఘటన!

అనంతపురం జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. కేఎస్ ఆర్ జూనియర్ కళాశాలలో చదువుతున్న నలుగురు విద్యార్థినులు ఒకేసారి ఆత్మహత్య ప్రయత్నం చేయడం కలకలం రేపింది. వీరు నలుగురు హెయిర్ డై రసాయనాన్ని తాగి చనిపోవడానికి కఠిన నిర్ణయం తీసుకున్నట్టు వీరిని ఆసుపత్రికి తరలించిన కళాశాల సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతం ఈ నలుగురు విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉంది.

అనంతపురంలో నలుగురు బాలికల ఆత్మహత్యా యత్నం
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరు ఎందుకు ఈ తీవ్ర నిర్ణయానికి ఒడిగట్టారు అంటే చదువులో సరిగ్గా వీరు రాణించక పోవడంతో హాస్టల్ వార్డెన్ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదని, తల్లిదండ్రులుగా వారికి సరైన దిశానిర్దేశం చేయాలని సూచించారు. దీంతో తల్లిదండ్రులు బాలికలను మందలించారు. బాగా చదువుకోవాలని చెప్పారు.

Shocking Incident in Anantapur Four Junior College Girls Attempt Suicide by drinking hair dye

బాలికల ఆత్మహత్యా యత్నానికి కారణం ఇదే
తల్లిదండ్రుల మందలింపుతో మనస్థాపానికి గురైన నలుగురు బాలికలు తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన నలుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. చదువుల ఒత్తిడి కారణంగానే బాలికలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తోటి విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ఘటన పైన స్థానికులు కేసు నమోదుచేసి దర్యాప్తును వేగవంతం చేశారు.

తొందరపాటు నిర్ణయాలకు కారణం ఇదే
అయితే ప్రస్తుతం అనంతపురం జిల్లాలో నలుగురి ఆత్మహత్యా యత్నం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకరు కాదు నలుగురు పిల్లలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం సాధారణమైన విషయం కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆత్మహత్యకు ప్రేరేపించేలా వస్తున్న ఆలోచనలు వంటి కారణాలతో చాలామంది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారని సైకాలజిస్ట్ లు చెబుతున్నారు.

ఆత్మహత్యల నివారణకు కొనసాగుతున్న కౌన్సిలింగ్.. అయినా కష్టమే
ఎవరైనా ఈ విధంగా మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటే మీ ప్రాంతంలో ఉండే మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. అంతేతప్ప తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ప్రాణాలు తీసుకోవడం మంచిది కాదని సలహా ఇస్తున్నారు. ఆత్మహత్యల నివారణ కోసం కళాశాలలు, స్కూల్స్ లో ఇప్పటికే కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అయినా చిన్న చిన్న కారణాలకే చాలా మంది ప్రాణాలు తీసుకునే దాకా వెళ్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+