Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాంగోపాల్ వర్మ తల నరికి తెస్తే కోటి రూపాయలిస్తానన్న ఉద్యమనేత: ఆర్జీవీ ఏం చేశారంటే!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు. ఈ సమయంలో ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సీఎం జగన్ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ నేపథ్యంలో వచ్చిన సినిమా వ్యూహం ఇప్పుడు ఏపీలో రచ్చగా మారింది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కించ పరిచే విధంగా ఈ సినిమా రూపొందించారని టిడిపి, జనసేన కార్యకర్తల నుంచి నేతల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇదే సమయంలో ఈ సినిమా విడుదలను ఆపాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతుంది.

shocking: one crore rupees to anyone who beheaded Ramgopal Varma; RGV reacted!!

సినిమాను ఈనెల 29వ తేదీన విడుదల చేస్తామని ఆర్జీవి ప్రకటించడంతో టిడిపి, జనసేన వ్యూహం సినిమా విడుదలను అడ్డుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే నిన్న రాత్రి టీవీ డిబేట్లో మాట్లాడుతూ అమరావతి ఉద్యమ నేత కొలికి పూడి శ్రీనివాసరావు వ్యూహం సినిమాపై, ఆర్జీవి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాంగోపాల్ వర్మ తల నరికి ఎవరైనా తెస్తే వాళ్ళకి కోటి రూపాయలు ఇస్తానని బహిరంగంగా ప్రకటించారు. టీవీ డిబేట్ షోలో ఉన్న యాంకర్ సాంబశివరావు కూడా తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని శ్రీనివాసరావుకు చెప్పినప్పటికీ ఆయన ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. మళ్ళీ అదే మాట చెబుతున్నా.. ఆర్జీవి తల నరికి తెచ్చిన వారికి కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

అయితే కొలికి పూడి శ్రీనివాసరావు వ్యాఖ్యల పైన స్పందించిన రామ్ గోపాల్ వర్మ వీడియో క్లిప్ ను ఏపీ పోలీసులను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కొలికపూడి శ్రీనివాసరావు నన్ను చంపడానికి కోటి రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చాడు. అతనికి ఒక న్యూస్ ఛానెల్‌కు చెందిన సాంబ శివరావు అనే యాంకర్ తెలివిగా సహాయం చేసాడని, వారిద్దరూ కలిసి తన హత్యకు ప్లాన్ చేశారన్నారు.

దయచేసి దీన్ని నా అధికారిక ఫిర్యాదుగా పరిగణించండి అంటూ మొదట ట్వీట్ చేశారు. ఆ తర్వాత మరొక ట్వీట్ లో తెలుగుదేశం పార్టీ దాని అధినేత చంద్రబాబు నాయుడు ప్రతినిధులు, వారికి అనుబంధంగా ఉన్న ఛానల్లో పబ్లిక్ గా ప్రజలు తలలను నరకాలని సుపారీలు ఇస్తున్నారని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు.

ఇక దీనిని ఖండించకపోతే, బహిరంగంగా వారిని తరిమి కొట్టకపోతే కాంట్రాక్ట్ హత్యలు టిడిపి అధికారిక విధానంగా గుర్తించబడతాయి అని రాంగోపాల్ వర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు. తనను చంపడానికి డబ్బు కాంట్రాక్ట్ ఇస్తున్నందుకు కొలికపూడి శ్రీనివాసరావుపై, ఆ టీవీ డిబేట్ నిర్వహించిన యాంకర్ సాంబశివరావు మరియు యజమాని బిఆర్ నాయుడుపై తాను అధికారికంగా పోలీసు ఫిర్యాదును ఇస్తున్నానని పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+