షాకింగ్: ఏపీలో మద్యం షాపుల కోసం ఎగబడుతుంది వారే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దుచేసి ఆ స్థానంలో ప్రైవేటుకు మద్యం దుకాణాలను పాత పద్ధతిలోనే ఇచ్చేందుకు నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం ఆ మేరకు దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే ఊహించని విధంగా రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాల దరఖాస్తుకు విపరీతమైన పోటీ నెలకొంది. ఈసారి ఏపీలో మద్యం దుకాణాల దరఖాస్తులు వేయడానికి ఏమాత్రం ఆ రంగంలో అనుభవం లేని వారు కూడా ముందుకు వచ్చారు.

ఒక్కో షాపుకు భారీ మద్యం దరఖాస్తులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులకు ప్రస్తుతం దాఖలవుతున్న దరఖాస్తులను చూస్తే ఒక్కో షాపుకు అంచనాలను మించి దరఖాస్తులు వచ్చేలా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు మద్యం దుకాణాలు నిర్వహించినవారు రెస్టారెంట్లు నడిపిన వారు దరఖాస్తులు చేసుకుంటారని భావిస్తే వారే కాదు సమాజంలో విభిన్న వర్గాల వారు మద్యం షాపుల కోసం దరఖాస్తులు వేస్తున్నారు.

shocking software engineers highest applications for ap new liquor shops in ap new liquor policy 2024

లిక్కర్ షాపుల దరఖాస్తులలో వారే ఎక్కువ
సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వైద్యులు, కాంట్రాక్టర్లు, ఆడిటర్లు దరఖాస్తులు దాఖలు చేస్తున్న వారిలో ఉన్నారు. ఇప్పటివరకు ఏపీలో మద్యం షాపులకు వేస్తున్న దరఖాస్తులలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వేసిన దరఖాస్తులే ఎక్కువ ఉన్నాయని సమాచారం. ఇది ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది.ఇక లిక్కర్ షాపుల కోసం దరఖాస్తులు వేస్తున్న వారు వారికి వచ్చే సందేహాలను నివృత్తి చేసుకోవడానికి స్వయంగా కార్యాలయానికి వెళ్లి అధికారులతో మాట్లాడి తెలుసుకుంటున్నారు.

గతంలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి కేవలం పదివేల రూపాయలు మాత్రమే రుసుము ఉండేది. ఎవరు పడితే వారు మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకొని తీరా మద్యం షాపు దక్కిన తర్వాత లైసెన్స్ కు కట్టాల్సిన ఫీజులు కట్టకపోవడంతో మళ్లీ కొత్తవారికి అవకాశం ఇవ్వవలసి వచ్చేది. గతంలో మూడు వాయిదాలలో లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉండేది. అయితే కూటమి ప్రభుత్వం దీనిని ఆరు వాయిదాలకు పెంచింది.

ఏపీలో అక్కడ విపరీతమైన పోటీ
దీంతో ప్రస్తుతం లిక్కర్ షాపులకు ఎక్కువ మంది ఆశావహులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఒకప్పుడు లిక్కర్ బిజినెస్ అంటే అది తెలిసిన వాళ్ళు చేసే వ్యాపారం అని భావించగా ప్రస్తుతం లిక్కర్ బిజినెస్ లు లాభసాటి వ్యాపారంగా భావించి వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులు ఈ వ్యాపారం లోకి దిగేందుకు ఆసక్తి చూపించడం ప్రధానంగా కనిపిస్తుంది. ముఖ్యంగా గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, పొన్నూరు తదితరచోట్ల మద్యం షాపులకు విపరీతమైన పోటీ ఉంది.

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల దరఖాస్తులపై ఆసక్తి
ఇక్కడ సగటున ఒక్కో షాపుకు పదికి పైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు భావించారు కానీ ప్రస్తుతం వస్తున్న దరఖాస్తులను చూసి అధికారులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా ఉన్నత విద్యావంతులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మద్యం షాపుల కోసం దరఖాస్తులు వేయడం ప్రస్తుతం ఆసక్తిని కలిగిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+