బరువు తగ్గాలని ప్రయత్నించేవారికి పొంచివున్న ప్రమాదం!
బరువు తగ్గాలని, శరీరం ఫిట్ గా ఉండాలని ఆరాటపడేవారికి మొదటి శత్రువు తేనీరు. ప్రతిరోజు టీ తాగడంవల్ల బరువు తగ్గే సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గాలని ప్రయత్నించేవారిని ఒక ప్రశ్న వేధిస్తుందని, టీ తాగడం మంచిదా? చెడ్డదా? అని. అయితే టీ తాగడం మంచిది కాదని, సరైన మొత్తంలో టీ తాగకపోతే బరువు తగ్గడాన్ని అడ్డుకుంటుందని చెబుతున్నారు.
ప్రజల్లో 90 శాతం మంది తేనీరు తాగుతుంటారు. శరీరంతోపాటు మనసు కూడా రిఫ్రెష్ అవుతుందనే భావనతో ఉదయం, సాయంత్రం రెండుపూటలా టీ తాగుతుంటారు. మరికొందరు రోజుకు నాలుగుసార్లు కూడా తాగుతుంటారు. వేసవికాలంలో ఎంత దాహార్తి వేస్తున్న శీతల పానీయాలకు బదులుగా టీ తాగడానికి ఇష్టపడేవారే కోకొల్లలు.

బరువు తగ్గే సమయంలో టీ తాగుతుంటే ఎందుకు ప్రతికూల ప్రభావాలుంటాయనేదానికి టీతోపాటు స్నాక్స్ కూడా తీసుకుంటారని, ఇవి బరువు తగ్గే ప్రయత్నాలకు అడ్డంకులు. పాలతో టీ తయారుచేస్తారు కాబట్టి పేగుల్లోని అదనపు కొవ్వు శోషణను టీ నిరోధిస్తుందని, ఆ సామర్థ్యం టీకి ఉందని ఆహార నిపుణులు చెబుతున్నారు. ప్రొటీన్లు అధికంగా ఉండే పాలను కలిపి తయారు చేస్తారు కాబట్టి కొవ్వు శోషణ తగ్గుతుంది.
ఇంట్లో అయినా, ఆఫీసులో అయినా ఒక్క టీ తాగితే సంతృప్తి కలగదు. అందుకే బిస్కెట్, వడ, సమోసాలాంటివి తింటుంటారు. దీనివల్ల కూడా బరువు తగ్గాలనుకునేవారు ఆశించిన ఫలితాలను పొందలేరు. నిద్ర పోయే సమయంలో టీ తాగడం మంచిది కాదని, నిద్ర లేమి వస్తుందని, టీలో అల్లం, ఏలకులు, దాల్చినచెక్క లాంటివి కలిపి తాగొచ్చని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications