'శిల్పా సొసైటీ పేరుతొ సొంతగా కార్యక్రమాలు, ఆ పద్ధతి వైసిపిలో లేదు'
నంద్యాలలో వైసిపి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించనున్న బహిరంగ సభలో పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ పాల్గొననున్నారు.
నంద్యాల: నంద్యాలలో వైసిపి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించనున్న బహిరంగ సభలో పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించే బహిరంగ సభలో శిల్పా చక్రపాణి రెడ్డి వైసిపి తీర్థం పుచ్చుకుంటారు.

ఎస్పీజీ మైదానంలో బహిరంగ సభ
ఎస్పీజీ మైదానంలో ఈ బహిరంగ సభ జరగనుంది. ఈ మేరకు పార్టీ నేత బొత్స సత్యనారాయణ వివరాలు వెల్లడించారు. మూడేళ్లు నంద్యాల గురించి పట్టించుకోని టిడిపి నాయకులు ఉప ఎన్నికల నేపథ్యంలో దొంగ ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు.
Recommended Video


శిల్పా సొసైటీ పేరుతో..
శిల్పా సొసైటీ పేరుతో తమ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి తన సొంత డబ్బులతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని బొత్స చెప్పారు. వైసిపి ఎప్పుడూ ప్రజలకు హామీ ఇస్తుందే, తప్ప నాయకులకు హామీ ఇవ్వదని వ్యాఖ్యానించారు.

ఆ పద్ధతి వైసిపిలో లేదు
అంబటి రాంబాబు మాట్లాడుతూ... డబ్బులు, పదవులు ఇచ్చి నాయకులను పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమం టిడిపిలోనే జరుగుతుందని విమర్శించారు. వైసిపిలో ఆ పద్ధతి ఉండదని చెప్పారు. జగన్‌ను చూసి అందరూ పార్టీలో చేరుతున్నారన్నారు.

అధికార దుర్వినియోగం అంటూ
ఇదిలా ఉండగా, ఏపీలో నంద్యాల ఉప ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు, మద్యం వినియోగిస్తున్నారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఎన్నికల నిఘా వేదిక రాష్ట్ర కమిటి ఆరోపించింది. ఓటర్లు ప్రలోభాలకు గురి కాకుండా ఓటు హక్కును స్వేచ్ఛగా, ప్రశాంతంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!!












Click it and Unblock the Notifications