అభివృద్దికి శిల్పా అడ్డుపడ్డాడు, భూమావర్గంపై కేసులు: అఖిలప్రియ సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

నంద్యాల:నియోజకవర్గ ప్రజలకు తన తండ్రి ఇచ్చిన హమీలను నెరవేర్చకుండా మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి అడ్డుకొన్నారని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు.

రక్తసంబంధాన్ని వీడను, టిక్కెట్టుకోసం చేరలేదు, కానీ, ఓడిస్తామన్నారు:శిల్పా సంచలనం

వైసీపీలో శిల్పా మోహన్ రెడ్డి చేరిన తర్వాత ఆమె నంద్యాలలో మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చేందుకుగాను వారికి భోజనం పెట్టి వాటిని అందజేయాలని భావిస్తే శిల్పా మోహన్ రెడ్డి అడ్డుకొన్నారని చెప్పారు.

Silpa Mohan Reddy try to obstruced development works in Nandyal:Akhilapriya

భూమా వర్గంపై శిల్పా మోహన్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టించారో ప్రజలందరికీ తెలుసుననని చెప్పారు. అయితే కేసులకు భయపడకుండానే భూమా ఆశయాలకోసం అనుచరవర్గమంతా పార్టీలోనే పనిచేస్తున్నారని ఆమె చెప్పారు.

మున్సిఫల్ ఛైర్ పర్సన్ సులోచన తీరుతో కౌన్సిలర్లు వార్డుల్లో పనులు మంజూరు కాక, ప్రజలకు సమాధఆనం చెప్పుకోక ఇబ్బందిపడుతున్నారని చెప్పారు. నంద్యాల అభివృద్దికి రూ. 500 కోట్లను సీఎం మంజూరు చేయడం, 13 వేల ఇళ్ళు నిర్మించడాన్ని శిల్పా మోహన్ రెడ్డి అడ్డుకోవాలని ప్రయత్నించారని ఆరోపించారు.

మున్సిఫల్ గేట్ల వేలం పాటల కోసం ఎంపీ ఎస్పీవై రెడ్డి ఛైర్ పర్సన్ కు పోన్ చేస్తే కనీసం ఆయనకు మర్యాద ఇవ్వకుండానే ఫోన్ ను కట్ చేశారని మంత్రి గుర్తుచేశారు. తనపై ఆరోపణలు చేయడం అవివేకమన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Silpa Mohan Reddy try to obstruced development works in Nandyal said Ap Tourism minister Bhuma Akhila Priya on Wednesday. she spoke media in Nandhyala after Silpa joined in ysrcp .
Please Wait while comments are loading...