లిక్కర్ కేసులో కీలక మలుపు - మరో వైసీపీ ముఖ్య నేత 'ఫిక్స్'..!?

మద్యం కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో కొత్త వ్యక్తుల ప్రమేయం పైన ఆధారాలు దొరుకుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురు వైసీపీ నేతలను సెట్ అరెస్ట్ చేసింది. కొందరు బెయిల్ పైన బయటకు వచ్చారు. ఎంపీ మిథున్ రెడ్డితో పాటుగా చెవిరెడ్డి మరి కొందరు జైలులోనే ఉన్నారు. ఇప్పుడు ఇదే సమయంలో అనూహ్యంగా వైసీపీ దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేరును సిట్ తాజా ఛార్జ్ షీట్ లో ప్రస్తావించింది. కీలక అంశాలను వెల్లడించింది.

మద్యం కేసులో మరో వైపీపీ ముఖ్య నేత పేరు తెర మీదకు వచ్చింది. దర్శి వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి పేరు ను తాజాగా సిట్ ఛార్జ్ షీట్ లో ప్రస్తావించింది. గత ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేసేందుకు మద్యం ముడుపుల సొమ్మును ఆయనకు అందచేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. దీంతో, తాజాగా దాఖలు చేసిన రెండో అనుబంధ అభియోగపత్రంలో మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగ్గా, కొద్ది రోజుల ముందు అంటే ఏప్రిల్ 21,22 తేదీల్లో చెవిరెడ్డి, బాలాజీ కుమార్ యాదవ్ ప్రకాశ్ జిల్లా పొదిలిలో ఉన్నట్లు సిట్ అభియోగ పత్రంలో పేర్కొంది. అదే సమయంలో బాలాజీ కుమార్ యాదవ్ పలుమార్లు శివప్రసాద్ రెడ్డి తో ఫోన్ కాల్స్ మాట్లాడారని వెల్లడించింది.

SIT included MLA shiva Prasada Reddy name in liquor charge sheet details here

చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని పలువురు వైసీపీ అభ్యర్ధులకు ఎన్నికల ఖర్చుల నిమిత్తం మద్యం ముడుపుల సొమ్ము చేరవేతంతా చెవిరెడ్డి పర్యవేక్షణలో సాగిందని సిట్ ఇప్పటికే ఆధారాలు సేకరించింది. ఈ క్రమంలోనే శివప్రసాద్ రెడ్డికి మద్యం ముడుపుల సొమ్ము అందించి నట్లు సిట్ గుర్తించింది. దీంతో, త్వరలోనే శివప్రసాద్ రెడ్డిని సిట్ విచారణ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

అటు అరెస్ట్ అయిన నేతలు డిఫాల్ట్ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 90 రోజుల కస్టడీ పూర్తి కావటంతో బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. అటు ధనుంజయరెడ్డితో పాటుగా మరో ఇద్దరు బెయిల్ పైన బయటకు వచ్చారు. వీరి బెయిల్ ను సిట్ హైకోర్టులో అప్పీల్ చేసింది. ఇక.. ఈ కేసులో సిట్ తదుపరి విచారణ... చోటు చేసుకునే పరిణామాల పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+