సుప్రీం చేతికి తిరుమల లడ్డూ కల్తీపై సిట్ రిపోర్ట్..! సీల్డ్ కవర్ లో ఏముందంటే ?

గతేడాది ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూ కల్తీ అయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. లడ్డూ తయారీ కోసం జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని వినియోగించారని ఆరోపించారు. ఇదంతా సనాతన ధర్మానికి విరుద్దమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్వరం కలిపారు. వైసీపీ మాత్రం లడ్డూ కల్తీ జరగలేదని, ఇదంతా చంద్రబాబు కుట్రేనని కౌంటర్ ఇచ్చింది. చివరికి ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది.

దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు తిరుమల లడ్డూ కల్తీ జరిగిందో లేదో తేల్చేందుకు సిట్ ను ఏర్పాటు చేసింది. ఇందులో సీబీఐతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పోలీసు అధికారుల్ని కూడా చేర్చింది. ఈ బృందం అప్పటి నుంచి సమగ్రంగా దర్యాప్తు జరిపింది. టీటీడీకి లడ్డూ తయారీ కోసం నెయ్యి సరఫరా చేసిన పలు కంపెనీలను విచారించడంతో పాటు కేసులు కూడా నమోదు చేసింది. నిందితుల్ని అరెస్టులు కూడా చేసింది. ఈ దర్యాప్తును తాజాగా పూర్తి చేసిన సిట్ సుప్రీంకోర్టుకు నివేదికను సీల్డ్ కవర్ లో అందజేసింది.

SIT submits report on tirupati laddu adulteration to supreme court

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు సిట్ అందించిన నివేదికపై త్వరలో విచారణ జరగనుంది. ఇందులో లడ్డూ కల్తీ అయినట్లు తేలితే సుప్రీంకోర్టు ఏం చర్యలు తీసుకుంటుందన్నది ఉత్కంఠ రేపుతోంది. అలాగే లడ్డూ కల్తీ జరగలేదని తేలితే వైసీపీకి ఊరట లభించినట్లవుతుంది. దీంతో సుప్రీంకోర్టుకు సిట్ ఇచ్చిన నివేదిక కీలకంగా మారింది. ఈ నివేదికలో సిట్ లడ్డూ కల్తీ కేసులో స్దానిక కోర్టుల నుంచి హైకోర్టు వరకూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్ల వివరాలతో పాటు వివిధ డెయిరీల్లో జరిపిన దర్యాప్తు వివరాలను కూడా అందించింది.

SIT submits report on tirupati laddu adulteration to supreme court

తిరుమల లడ్డూ తయారీ కోసం కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని సిట్ తమ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అలాగే టీటీడీతో పాటు దేశంలోని పలు ఆలయాలకు కూడా కల్తీ నెయ్యి సరఫరా జరుగుతున్నట్లు కూడా గుర్తించినట్లు సమాచారం. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేస్తోంది భోలే బాబా డెయిరీ అని తేల్చినట్లు కూడా సమాచారం. ఈ కల్తీ నెయ్యి సరఫరాతో ఏకంగా 240 కోట్ల మేరకు సదరు డెయిరీ లబ్ది పొందినట్లు కూడా గుర్తించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+