కూతురి పెళ్లిలో కుప్పకూలిన జగన్ పార్టీ ఎమ్మెల్యే
నెల్లూరు: తన కుమార్తె వివాహ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక్కసారిగా స్పృహ తప్పి మండపంలోనే కుప్పకూలారు. ఆయనకు స్వల్పంగా గుండోపోటు వచ్చినట్లు తెలుస్తోంది.

కాగా, అప్పటి వరకూ ఆనందోత్సాహాల మధ్య ఉన్న కళ్యాణ మండపంలో వాతావరణం గంభీరంగా మారిపోయింది. మండపంలోనే ఉన్న కొందరు వైద్యులు శ్రీధర్ రెడ్డికి ప్రాథమిక చికిత్సను అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. మరిన్నివివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications