South Central Railway :విజయవాడ, తిరుపతి, బాపట్ల, విశాఖపట్నం వారికి ముఖ్య గమనిక
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచన చేసింది. విజయవాడ డివిజన్ పరిధిలోని బాపట్ల రైల్వేస్టేషన్ సమీపంలో మూడోలైను నిర్మాణంతోపాటు నాన్ ఇంటర్ లాకింగ్ పనులవల్ల కొన్ని రైళ్లను రద్దుచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అక్టోబరు 4, 6, 8 తేదీల్లో తిరుపతి-విశాఖ(22708) డబుల్ డెక్కర్, అక్టోబరు 5, 7, 9 తేదీల్లో విశాఖ-తిరుపతి(22707) డబుల్ డెక్కర్ రైలును రద్దు చేసినట్లు తెలిపారు.
భువనేశ్వర్-తిరుపతి (02809) ప్రత్యేక రైలు ఈనెల 30, అక్టోబరు 7న, తిరుపతి-భువనేశ్వర్(02810) ప్రత్యేక రైలు అక్టోబరు 1, 8 తేదీల్లో రద్దు చేశారు. అక్టోబరు 8న భువనేశ్వర్-తిరుపతి(22871), అక్టోబరు 9న తిరుపతి-భువనేశ్వర్(22872), ఈనెల 22 విశాఖ-చెన్నై సెంట్రల్ (22869) రద్దయ్యాయి. అక్టోబరు 2, 9 తేదీల్లో, చెన్నై సెంట్రల్-విశాఖ(22870).. ఈనెల 26, అక్టోబరు 3, 10 తేదీల్లో, సంబల్‌పూర్-ఈరోడ్(08311) ప్రత్యేక రైలు.. ఈనెల 27, అక్టోబర్ 4న, ఈరోడ్-సంబల్‌పూర్(08312) ప్రత్యేక రైలు రద్దు చేశారు.

ఈనెల 29, అక్టోబరు 6న, విశాఖ-బెంగళూరు కంటోన్మెంట్(08543) స్పెషల్ రైలు.. ఈనెల 24, అక్టోబరు 1, 8 తేదీల్లో, బెంగళూరు కంటోన్మెంట్-విశాఖ(08544) స్పెషల్ ట్రైన్ ఈనెల 25, అక్టోబరు 2, 9 తేదీల్లో రద్దు చేసినట్లు వెల్లడించారు. బొకారో ఎక్‌ప్రెస్ ను దారి మళ్లించి తిప్పనున్నారు. ధన్‌బాద్-అలెప్పీ(13351) బొకారో ఎక్స్‌ప్రెస్ అక్టోబరు 2, 10 తేదీల్లో నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ మీదుగా నడుస్తుంది. ఆ రెండు రోజుల్లో తాడేపల్లిగూడెం, ఏలూరు స్టాప్‌లను రద్దు చేశారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి రైల్వేకు సహకరించాలని అధికారులు కోరారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో












Click it and Unblock the Notifications