బాలకృష్ణ మాటలకు జూనియర్ ఎన్టీఆర్ సమాధానం...

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో మరోసారి తెలుగుదేశం పార్టీకి సంబంధించి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య వివాదం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలోకానీ, ఆ తర్వాత కానీ సినీ పరిశ్రమ నుంచి కేఎస్ రామారావు, కె.రాఘవేంద్రరావు, అశ్వనీదత్ మినహా మిగిలిన ఎవరూ స్పందించలేదు.

ఈనెల 30వ తేదీన తెలంగాణలో జరిగే పోలింగ్ కు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉంది. దీంతో అన్ని ప్రధాన పార్టీలు టీడీపీ మద్దతుదారుల ఓట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ తరఫువారు, బీజేపీ, కాంగ్రెస్ తరఫున పోటీచేసే అభ్యర్థులంతా తమ తమ ప్రచారాల్లో తెలుగుదేశం పార్టీ జెండాలను కూడా ఉంచుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ మద్దతు తమకే ఉందని ప్రచారం చేసుకుంటున్నారు.

social media war between junior ntr fans and nandamuri balakrishna fans

చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి విలేకరులు వివరణ కోరగా ఎవరు స్పందించినా, స్పందించకపోయినా డోంట్ కేర్ అన్నారు. చంద్రబాబు బెయిల్ పై బయటకు వచ్చారు. రేపో, ఎల్లుండో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు మీడియాతో కూడా మాట్లాడనున్నారు. పార్టీకి, సినిమాకు సంబంధం లేదని, ప్రస్తుతం తారక్ తన సినిమాలు తాను చేసుకుంటున్నాడని, ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా మారిపోయిన తర్వాత ఇతర కార్యకలాపాలపై పెద్దగా దృష్టి సారించడంలేదని చెబుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు.

పార్టీకానీ, పార్టీ అధినేత కానీ కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించకపోతే ఏమనుకుంటారని, ఆ నైజం సరైందికాదని, ఆ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ విఫలమయ్యాడని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇప్పటికీ జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ స్పందించలేదు. అంతర్గతంగా ఏమైనా మాట్లాడారా? అనే విషయంలో స్పష్టత లేదు. తెలుగుదేశం పార్టీలోనే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఒక వర్గంగా, తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరో వర్గంగా విడిపోయి కోట్లాడుకుంటున్నారు. ఈ వివాదం ఎటువంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+