సూర్యగ్రహణం: కాకినాడలో మరో దారుణం.. మహిళపై మూకదాడి.. ఉద్రిక్తత..
సూర్యగ్రహణం రోజున ఏం చెయ్యాలి? ఏవి చెయ్యకూడదు? అనే భిన్నవాదనలతోపాటు మూఢనమ్మకాలకు సంబంధించిన ఘటనలూ అనేకం వెలుగులోకి వస్తున్నాయి. కర్నాటకలో తల్లిదండ్రులే పిల్లల్ని పీకల్లోతు మట్టిలో పూడ్చిపెట్టిన వీడియోలు వైరలైన తర్వాత.. ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో చోటుచేసుకున్న ఘటన కలకలం రేపుతున్నది.
ఒకటిన్నర చావుకు ఆమె కారణం..
సూర్యగ్రహణం కొనసాగుతున్న సమయంలోనే.. కాకినాడ శివారులోని ఓ గ్రామంలో పాపమ్మ అనే మహిళపై స్థానికులు మూకదాడి చేశారు. పాపమ్మకు చేతబడి మంత్రాలు వచ్చని, ఆమె వల్ల గ్రామంలో భయాందోళనలు చెలరేగుతున్నాయని, ఆమె చేతబడి చేయడం వల్లే గ్రామంలో సత్యనారాయణ అనే వ్యక్తి చనిపోయాడని, పాపమ్మతో మాట్లాడిన కొద్దిసేపటికే గ్రామానికి చెందిన మరో యువతి ఆత్మహత్యాయత్నం చేసిందని గ్రామస్తులు ఆరోపించారు.

ఊరంతా ఒక్కటై దాడి చేశారు..
గ్రామంలో చోటుచేసుకుంటున్న సంఘటనలకు కారణం పాపమ్మ మంత్రాలేనని నిర్ధారించుకున్న స్థానికులు.. ఆమెపై దాడికి ప్లాన్ చేశారు. బాధితుల కుటుంబాలతోపాటు ఊరందరినీ ఒక్కటిచేసి.. ఆమె ఇంటిపై మూకదాడికి పాల్పడ్డారు. దాడి చయడమేకాక పాపమ్మ ఇంటిని కూడా స్థానికులు ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఘటనపై పోలీసులుగానీ, ప్రభుత్వాధికారులుగానీ ఇంకా స్పందించలేదు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications