Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పోలీసులపై లోకేశ్ ఫైర్: మహిళలపై బూటుతో తన్నడమేంటీ..? డీజీపీ ఫ్యామిలీతో ఇలాగే వ్యవహరిస్తారా...?

ఏపీలో రాజధాని మార్పుపై ఆందోళన పీక్ స్టేజీకి చేరింది. అయితే కొందరు పోలీసులు మహిళలపై షూతో తన్నడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీసుల తీరు సరికాదని.. పై స్థాయి అధికారులకు సంబంధించిన కుటుంబసభ్యులతో ఇలాగే ప్రవర్తిస్తారా అని ప్రశ్నించారు.

అమరావతిలో పోలీసుల అరాచకం పరాకాష్టకు చేరిందని విమర్శించారు. మహిళలు అని కూడా చూడకుండా దారుణంగా ప్రవర్తించడం సరికాదన్నారు. మహిళలను పోలీసులు బూటు కాలుతో తన్నడం ఏంటీ అని మండిపడ్డారు. గుంటూరు రూరల్ ఎస్పీ లాఠీ పట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని అని ప్రశ్నించారు.

some police are misbehave women: nara lokesh

పోలీసు బాస్ డీజీపీ కుటుంబసభ్యులతో కూడా పోలీసులు ఇలాగే ప్రవర్తిసారా అని అడిగారు. అలా బీహేవ్ చేస్తే మీరు ఊరుకుంటారా అని నిలదీశారు. కానీ పోలీసులు పద్ధతి మాత్రం సరికాదని వారు చేసే అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.

అమరావతిలో మహిళలపై పోలీసుల దాడులు మహిళ కమిషన్‌కు కనిపించడం లేదా అని లోకేశ్ ప్రశ్నించారు. సాటి మహిళ అయిన కమిషన్ చైర్ పర్సన్ అతివలపై జరిగిన దాడులపై స్పందించకపోవడం దారుణమని చెప్పారు. ఇదే కాదు నిన్న మందడం వెళ్లబోతుంటే లోకేశ్‌ను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. తన పార్టీ కార్యాలయం వద్దకు వెళతానని కోరినా.. పోలీసులు వినిపించుకోలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+