సోనియా పెద్ద దెయ్యం, సుష్మా చిన్న దెయ్యం: సోమిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు) చారిత్రక తప్పిదమన్నారు. సోనియా, సుష్మా చేతులు కలపడం దురదృష్టకరమన్నారు. వారు పెద్దమ్మలు, చిన్నమ్మలు అనుకుంటున్నారని కానీ, సోనియా పెద్ద దయ్యం, సుష్మ చిన్నదెయ్యమన్నారు. సీమాంధ్ర ఎంపీలతో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. సీమాంధ్రలో లోటు సంగతేమిటని ప్రశ్నించారు.
బిజెపి పట్టుబడుతుందనుకున్నాం: యనమల
సమన్యాయం కోసం బిజెపి పట్టుబడుతుందని తాము భావించామని యనమల రామకృష్ణుడు అన్నారు. సమన్యాయం జరిగే వరకు తెలంగాణ బిల్లు రాదని భావించామని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపితో పొత్తుపై నిన్నటి సమావేశంలో చర్చ జరగలేదన్నారు. లోకసభలో బిజెపి తీరు ఆ పార్టీ విధానంగానే భావిస్తామన్నారు.
సోనియాపై కొణతాల
సోనియా కాంగ్రెస్ మాఫియా డాన్ అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ అన్నారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనకు అన్ని విధాలుగా సహకరించి తెలుగు ప్రజలను మోసం చేశారన్నారు. ఎన్నికలు వేళ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.












Click it and Unblock the Notifications