పవన్ కళ్యాణ్‌పై కుట్రలు: పెద్దలకు చెప్పామన్న సోము వీర్రాజు, వైసీపీ సర్కారుకు హితవు

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టే కార్యక్రమాలకు ఏపీ బీజేపీ పూర్తి మద్దతు ప్రకటిస్తోంది. తాజాగా, విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్‌కు ఎదురైన పరిణామాలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందిస్తూ.. వైసీపీ సర్కారుపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. పవన్ కళ్యాణ్ మద్దతుగా ఉంటామన్నారు.

ఏపీ బీజేపీ ఫుల్ సపోర్ట్.. పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు

ఏపీ బీజేపీ ఫుల్ సపోర్ట్.. పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు

కాగా, విశాఖపట్నం నుంచి విజయవాడకు వచ్చిన పవన్ కళ్యాణ్‌ను సోము వీర్రాజు కలిసి సంఘీభావం ప్రకటించారు. వీరి భేటీ అనంతరం సంయుక్తంగా మీడియా ముందుకు వచ్చారు. తనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన బీజేపీ నేతలకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. విశాఖలో సోమవారంనాటి ఘటన పూర్తిగా ప్రభుత్వ కుట్నేనని భావిస్తున్నట్లు చెప్పారు. సన్నాసులు ఏదో వాగుతారని, వారి గురించి పట్టించుకోనవడం సలేదన్నారు.

పవన్ కళ్యాణ్‌పై కుట్రలు.. బీజేపీ పెద్దలకు చెప్పామన్న సోము

పవన్ కళ్యాణ్‌పై కుట్రలు.. బీజేపీ పెద్దలకు చెప్పామన్న సోము

సోము వీర్రాజు మాట్లాడుతూ.. విశాఖలో నిర్వహించిన వైసీపీ గర్జన ప్రభుత్వం స్పాన్సర్ చేసిన కార్యక్రమమన్నారు. ఆ కార్యక్రమానికి ప్రజల నుంచి మద్దతు లభించకపోవడంతో.. వైసీపీ నేతలు తీవ్ర అసహనానికి గురై జనసేనపై కుట్రలకు తెరతీశారని మండిపడ్డారు. ఇటువంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని అన్నారు. ఈ అంశాలను కేంద్ర పెద్దలకు కూడా వివరించామని సోము వీర్రాజు తెలిపారు. విశాఖలో పవన్ కళ్యాణ్ పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ.. పోలీసులు మాత్రం అనుమతించలేదు. అంతేగాక, ప్రస్తుత పరిస్థితుల కారణంగా విశాఖలో ఎలాంటి కార్యక్రమాలను అనుమతించమని తేల్చిచెప్పారు. దీంతో సోమవారం విశాఖ నుంచి విజయవాడ చేరుకున్నారు పవన్ కళ్యాణ్.

వైసీపీ దిగజారుతోందన్న సోము వీర్రాజు

వైసీపీ దిగజారుతోందన్న సోము వీర్రాజు

అంతకుముందు, పవన్ ను కలవడంపై సోము వీర్రాజు ట్విట్టర్‌లో స్పందించారు. మిత్రపక్షం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించానని వెల్లడించారు. వ్యక్తిగత దూషణలతో మొదలైన వైసీపీ ప్రస్థానం, పోలీసులను అడ్డంపెట్టుకుని వ్యక్తిగత స్వేచ్ఛను హరించే స్థాయికి చేరిన తీరును ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. పాలనలో వ్యవస్థలను మేనేజ్ చేసే కుయుక్తులు ప్రదర్శించినా, ప్రజల మనసులో మార్పును, అంతిమంగా ప్రజాక్షేత్రంలో తీర్పును నిలువరించే శక్తిసామర్థ్యాలు ప్రభుత్వాలకు ఉండవని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+