ఒంగోలు ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..! ఆ నాలుగు ఎక్స్ ప్రెస్ లకూ..!
ఏపీలో ప్రకాశం జిల్లాలోని ఒంగోలు నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ముఖ్యంగా ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే వారికి గుడ్ న్యూస్ లభించింది. ఒంగోలు రైల్వే స్టేషన్ లో ఇప్పటివరకూ ఆగని నాలుగు ఎక్స్ ప్రెస్ రైళ్లకు ఇక్కడ అదనపు హాల్ట్ సౌకర్యం కల్పిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో సదరు రైళ్లలో ప్రయాణించేందుకు ఒంగోలు ప్రయాణికులకు అవకాశం కలగనుంది.
దానాపూర్-ఎస్ఎంవీటీ బెంగళూరుకు ప్రయాణించే ఎక్స్ ప్రెస్ రైళ్లు (నంబర్లు 03251, 03259)లకు అర్ధరాత్రి 1.28 గంటలకు ఒంగోలు రైల్వే స్టేషన్లో ఆగేందుకు అదనపు హాల్ట్ సౌకర్యం కల్పించారు. అలాగే ఉదయం 11.58కి ఎస్ఎంవీటి బెంగళూరు నుంచి దానాపూర్ కు వెళ్లే రెండు రైళ్లు (నంబర్ 03252, 03260)కు సైతం ఒంగోలు స్టేషన్లో ఆగేందుకు వీలుగా హాల్ట్ సౌకర్యం కల్పించారు. దీంతో ఈ నాలుగు రైళ్లలో ప్రయాణికులు ఇకపై ఆయా రైళ్లకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

దానాపూర్-ఎస్ఎంవీటీ బెంగళూరుకు ప్రయాణించే ఎక్స్ ప్రెస్ రైళ్లు జూన్ 1 నుంచి ఇలా ఒంగోలు రైల్వే స్టేషన్లో ఆగుతాయి. అలాగే ఎస్ఎంవీటి బెంగళూరు నుంచి దానాపూర్ కు వెళ్లే రెండు రైళ్లు జూన్ 3 నుంచి ఇలా ఒంగోలు స్టేషన్లో ఆగబోతున్నాయి. కాబట్టి ఒంగోలు నుంచి ఆయా ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు ఈ రైళ్లలో సీట్ల లభ్యత ఆధారంగా టికెట్లు బుక్ చేసుకుని ప్రయాణాలు సాగించవచ్చు.
మరోవైపు బల్లార్షా-కాజీపేట సెక్షన్ లో రైల్వే నాన్-ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా దానాపూర్-ఎస్ఎంవీటీ బెంగళూరుకు ప్రయాణించే ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 03251ను జూన్ 16న రద్దు చేస్తున్నారు. అలాగే ఎస్ఎంవీటి బెంగళూరు నుంచి దానాపూర్ కు వెళ్లే 03252 రైలును ఇదే కారణంతో జూన్ 18న రద్దు చేస్తున్నారు. కాబట్టి ఒంగోలుతో పాటు ఇతర స్టేషన్ల నుంచి ఈ రైళ్లకు టికెట్లు బుక్ చేసుకునే వారు దీన్ని గమనించాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications