రేపు, ఎల్లుండి.. ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే వారికోసం ప్రత్యేక రైళ్లు: హాల్ట్ స్టేషన్లు

దసరా పండగ సీజన్ లో రైళ్లకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ సీజన్‌లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది.

దాన్ని కొనసాగిస్తూ తాజాగా మరో ప్రత్యేక రైలును ప్రకటించారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. చర్లపల్లి నుంచి రేపల్లె మధ్య రాకపోకలు సాగించే ఫెస్టివల్ స్పెషల్ ఎక్స్ ప్రెస్ ఇది. 10 రోజుల సుదీర్ఘ దసరా సెలవుల అనంతరం హైదరాబాద్ కు తిరుగుముఖం పట్టే వారి కోసం దీన్ని నడిపించనున్నారు. ఈ ఎక్స్ ప్రెస్ రాకపోకల సమయాలు, ఇతర వివరాలను కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలును వినియోగించుకోవాలని సూచించారు.

South Central Railway has Announces Special Trains from Repalle to Charlapalli in Oct 21 and 22 rush
నేడు దహనం అయ్యేది కాక్రోచ్ దిష్టిబొమ్మ కూాడా..!!
నేడు దహనం అయ్యేది కాక్రోచ్ దిష్టిబొమ్మ కూాడా..!!
  • దసరా సెలవుల నేపథ్యంలో లక్షలాది మంది ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఏపీకి బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. వారందరూ కూడా తిరుగుముఖం పట్టనున్నారు. వారికి ఈ ఎక్స్ ప్రెస్ ఎంతగానో ఉపయోపడనుంది.
  • ఈ నెల 21వ తేదీ బుధవారం సాయంత్రం 7:45 నిమిషాలకు రేపల్లె నుంచి నంబర్ 07227 ప్రత్యేక రైలు మరుసటి రోజు తెల్లవారు జామున 5:00 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
  • తిరుగు ప్రయాణంలో.. గురువారం రాత్రి 11:30 నిమిషాలకు చర్లపల్లి నుంచి బయలుదేరే నంబర్ 07228 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 7:50 నిమిషాలకు రేపల్లికి చేరుకుంటుంది.
  • వేమూరు, తెనాలి, సంగం జాగర్లమూడి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా ఈ ప్రత్యేక రైలు రాకపోకలు సాగిస్తుంది. మొత్తం 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకెండ్ క్లాస్ బోగీలు దీనికి అందుబాటులో ఉంటాయి.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+