శేషాద్రి, సర్కార్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్
ప్రయాణికులకు మరింత మెరుగైన భద్రత, సౌకర్యాలను కల్పించడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు చర్యలు తీసుకున్నారు. మొత్తం ఏడు ఎక్స్ ప్రెస్ రైళ్లకు అత్యాధునిక లింక్ హాఫ్‌మన్ బుష్ (LHB) కోచ్ లను అమర్చనున్నారు. జనవరి 13 నుంచి 17 తేదీ మధ్య ఆయా రైళ్లకు ఈ బోగీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలో స్లీపర్ క్లాస్ బోగీల సంఖ్య గణనీయంగా తగ్గడంపై ప్రయాణికుల నుండి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
17235/17236 ఎస్ఎంవీటీ బెంగళూరు- నాగర్‌కోయిల్, 17210/17209 కాకినాడ టౌన్- బెంగళూరు శేషాద్రి ఎక్స్‌ప్రెస్, 56305/56310 నాగర్‌కోయిల్- తిరువనంతపురం నార్త్ అన్‌రిజర్వ్‌డ్ ప్యాసింజర్, 17652/17651 కాచిగూడ- చెంగల్పట్టు, 17644/17643 కాకినాడ పోర్ట్- చెంగల్పట్టు సర్కార్ ఎక్స్‌ప్రెస్, 17653/17654 కాచిగూడ- పుదుచ్చేరి, 17655/17656 కాకినాడ పోర్ట్- పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ లకు జనవరి నుంచి ఈ ఎల్ హెచ్ బీ బోగీలు అందుబాటులోకి వస్తాయి.

జర్మనీకి చెందిన లింకె హాఫ్మన్ బుషh సంస్థ డిజైన్ చేసిన బోగీలు ఇవి. చెన్నై, పంజాబ్‌లోని కపుర్తలా, రాయ్‌బరేలీల్లో గల రైల్వే కోచ్ ఫ్యాక్టరీల్లో ఇవి తయారవుతాయి. ఐసీఎఫ్ రూపొందించిన బోగీలతో పోల్చుకుంటే ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు మరింత సౌకర్యంగా, విలాసవంతంగా ఉంటాయి. గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగానికి అనుగుణంగా ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు రూపొందాయి. యాంటీ టెలిస్కోపిక్, అడ్వాన్స్‌డ్ న్యుమాటిక్ బ్రేక్ సిస్టమ్, యాంటీ కొలిషన్ అవాయిడ్ సిస్టమ్ ఇన్- బిల్ట్‌గా ఉంటాయి ఇందులో.
సాధారణ ఐసీఎఫ్ బోగీలతో పోల్చుకుంటే బరువు తక్కువ. లైట్ వెయిట్ మెటల్‌ను దీని తయారీలో వినియోగిస్తారు. 2022లో రైల్వేల్లో ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల వినియోగం మొదలైంది. మొట్టమొదటిసారిగా కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, చెన్నై మెయిల్, సికింద్రాబాద్- తిరువనంతపురం మధ్య రాకపోకలు సాగించే శబరి ఎక్స్‌ప్రెస్ సహా పలు రైళ్లకు కు ఈ బోగీలను సమకూర్చారు. తాజాగా ఈ ఏడు రైళ్లకు ఈ బోగీలు అందుబాటులోకి రానున్నాయి.
దీనివల్ల స్లీపర్ కోచ్ ల సంఖ్య తగ్గుతుంందనే ఆందోళన ఉంది. నిజానికి ఎల్ హెచ్ బీ కోచ్‌లకు అధిక సీటింగ్ సామర్థ్యం ఉంటుంది. 2-టయర్ ఏసీలో 52 బెర్త్‌లు, 3- టయర్ ఏసీలో 72, స్లీపర్ క్లాస్‌లో 80, జనరల్ సెకండ్ క్లాస్‌లో 100 సీట్లు ఉంటాయి. ఎల్ హెచ్ బీ ర్యాక్‌లను అమర్చిన తర్వాత, 2-టైర్ AC కోచ్‌లు రెండు, 3-టయర్ ఏసీ కోచ్‌లు 3, స్లీపర్ క్లాస్ కోచ్‌లు- 6, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు- 4, ఒక ఫిజికల్ దివ్యాంగ సెకండ్ క్లాస్ కోచ్, ఒక లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్‌తో నడుస్తాయి.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications