సభలో బాలకృష్ణ విజిల్స్, మార్షల్స్ ఎంట్రీ - సభ్యుల సస్పెన్షన్..!!

ఏపీ శాసనసభ(AP Assembly)లో రెండో రోజూ గందరగోళం కొనసాగుతోంది. తొలి రోజు మీసం తిప్పిన బాలయ్య (Balakrishna)రెండో రోజు విజిల్స్ ఊదుతూ కనిపించారు. దీని పైన ప్రభుత్వంలోని మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేసారు. చంద్రబాబు సీటు ఎక్కి బాలయ్య విజిల్ ఊదుతూ సభను అడ్డుకుంటున్నారని మంత్రులు మండిపడ్డారు. సభలో వీడియో తీయటం పైన ఆగ్రహించిన స్పీకర్ ఇద్దరు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసారు. బాలయ్య తీరు పైన అంబటి కీలక వ్యాఖ్యలు చేసారు.

బాలయ్య విజిల్స్:ఏపీలో శాసనసభలో టీడీపీ వర్సస్ వైసీపీ వాగ్వాదం కొనసాగుతోంది. తొలి రోజు మీసాలు తిప్పి సంచలనంగా మారిన బాలకృష్ణ..ఇతర సభ్యులతో కలిసి రెండో రోజు సభలో విజిల్స్ ఊదుతూ ఆందోళన చేసారు. సభ ప్రారంభం కాగానే స్పీకర్ పోడియం పైకి ఎక్కిన టీడీపీ సభ్యులు(TDP MLAs) సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. టీడీపీ సభ్యలు స్లోగన్స్ పైన మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసారు.

Speaker Serioys on TDP MLA Nandmuri Balakrishna, suspends two mlas

ఈ రోజు స్కిల్ స్కాం పైన చర్చకు సిద్దంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటించింది. టీడీపీ సభ్యులకు దైర్యం ఉంటే ఈ చర్చలో పాల్గొనాలని డిమాండ్ చేసారు. స్పీకర్ వారిస్తున్న బాలయ్య(Balakrishna)తో సహా ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు విజిల్స్ వేస్తూ తమ నిరసన కొనసాగించారు. చంద్రబాబు పై కేసులు ఎత్తివేయాలని నినదించారు.

ఇద్దరు సస్పెన్షన్:సభలో నిబంధనలకు విరుద్దంగా వీడియో తీసారనే కారణంతో అచ్చెన్నాయుడు, అశోక్ ను స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం ప్రకటించారు. ఈ సమావేశాలు ముగిసే వరకూ ఇద్దరినీ సస్పెండ్ చేసారు. సభలో నందమూరి బాలకృష్ణ విజల్ ఊదటం పైన మంత్రులు అంబటి రాంబాబు(Ambati Rambabau), కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. సభలో సీఎం పైన టీడీపీ చేసిన స్లోగన్స్ తో వైసీపీ సభ్యులు సీరియస్ గా స్పందించారు. ఈ సమయంలో మార్షల్స్ సభలోకి ప్రవేశించారు.

బాలకృష్ణ (Balakrishna)కూడా ఈ సారి సభకు ఎంపిక కాలేరని..బయటే ఫ్లూట్ ఊదుకోవాల్సి ఉంటుందని మంత్రి అంబటి వ్యాఖ్యానించారు. స్కిల్ స్కాం పైన చర్చించే ధైర్యం లేకనే టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారని మంత్రులు మండిపడ్డారు.

Speaker Serioys on TDP MLA Nandmuri Balakrishna, suspends two mlas

సభలో చంద్రబాబు కేసు:మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu) కేసుల పైన టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరిస్తున్నట్లు స్పీకర్(Speaker) ప్రకటించారు. ఈ రోజు సభలో ఇదే అంశం పైన స్వల్పకాలిక చర్చగా అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. ఈ చర్చలో వాయిదా తీర్మానం ఇచ్చిన సభ్యులు పాల్గొనవచ్చని స్పీకర్ సూచించారు. ప్రభుత్వం ఈ అంశం పైనే చర్చకు వచ్చిందని చెప్పుకొచ్చారు. అయితే, గతం కంటే భిన్నంగా ఈ సారి సమావేశాల్లో బాలకృష్ణ తీరు చర్చగా మారుతోంది. ఇక, ముఖ్యమంత్రి జగన్ శాసనసభకు చేరుకున్నారు. చంద్రబాబు స్కిల్ స్కాం పైన కాసేపట్లో సభలో చర్చ జరగనుంది. ప్రభుత్వం తమ వద్ద ఉన్న ఆధారాలను వివరిస్తూ ఈ స్కాం గురించి ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్దం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+