తిరుమల శ్రీవారికి తెప్పోత్సవాలతో పాటు ఫిబ్రవరిలో విశేష ఉత్సవాలు ఇవే!

తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల శ్రీవారికి ప్రతినెల విశేష ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఫిబ్రవరిలో మాసంలో స్వామివారి విశేష పర్వదినాలను గురించి టిటిడి ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ఏప్రిల్ నెల దర్శన టికెట్ల విడుదల వివరాలను వెల్లడించిన టిటిడి శ్రీవారి భక్తుల సౌకర్యం కోసం ముందుగానే ఎప్పటికప్పుడు కీలక అప్డేట్లను ఇస్తోంది.

ఫిబ్రవరిలో తిరుమల శ్రీవారికి విశేష ఉత్సవాలు
ప్రతి నెల విశేష ఉత్సవాల ప్రకటన కూడా ముందుగానే చేస్తుంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి మాసంలో తిరుమల శ్రీవారికి ముఖ్యమైన విశేష ఉత్సవాలు జరగనున్నాయి. ఆ విశేషాలను తెలుసుకుందాం. ఫిబ్రవరి ఒకటవ తేదీన శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి తిరుమలలో విశేషంగా నిర్వహిస్తారు. అదే రోజు మాఘ పౌర్ణమి సందర్భంగా భక్తులు శ్రీవారి గరుడ సేవను తిలకించే భాగ్యం దక్కుతుంది.

special festivals at Tirumala Srivari temple in February along with teppotsavalu

ఫిబ్రవరి మాసంలో 26వ తేదీ నుండి ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలు
అలాగే శ్రీవారి తెప్పోత్సవాలు ఫిబ్రవరి 26వ తేదీ నుండి ప్రారంభమవుతాయి. ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఫాల్గుణ పౌర్ణమికి ముందు ఈ తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. ఈసారి తెప్పోత్సవాలు ఫిబ్రవరి మాసంలో 26వ తేదీ నుండి ఐదు రోజుల పాటు జరుగుతాయి. తిరుమల శ్రీవారు శ్రీదేవి, భూదేవితో కొలువుతీరి పుష్కరిణిలో అందంగా అలంకరించిన తెప్పపై ఊరేగే ఈ ఉత్సవం స్వామివారి దివ్యమైన జల క్రీడలను సూచిస్తుంది.

వైష్ణవ ఆళ్వార్ ల తిరు నక్షత్రాలు
ఈ నెలలోనే ఇతర వైష్ణవ ఆళ్వార్ ల తిరు నక్షత్రాలు కూడా ఉన్నాయి. ఫిబ్రవరి మూడవ తేదీన తిరుమొళి శైయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, ఫిబ్రవరి 6న కూరత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రాలు జరుగుతాయి. ఫిబ్రవరి 28వ తేదీన కుళశేఖరాళ్వాల్ వర్ష తిరు నక్షత్రాన్ని నిర్వహిస్తారు. ఇలా ప్రతి నెలలోనూ విశేష ఉత్సవాలతో తిరుమల శ్రీవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.

తిరుమల ట్రిప్ ప్లాన్ ఇలా చేసుకోండి
ఫిబ్రవరిలో స్వామిని దర్శించుకోవాలని భావించేవారు ఈ ఉత్సవాల వేళ దివ్యమైన, రమ్యమైన స్వామిని దర్శించి తరించవచ్చు. అంతేకాదు తిరుమల శ్రీవారి సేవలు, తిరుమలలో రద్దీ గురించి కూడా ఎప్పటికప్పుడు టీటీడీ అందించే వివరాలను తెలుసుకుంటూ తదనుగుణంగా తిరుమల ట్రిప్ ప్లాన్ చేసుకోండి. ఆ ఏడుకొండలవాడిని దర్శించుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+