అమరావతి: అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు, శివమెత్తిన శివమణి
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని శంకుస్థాపన సభా ప్రాంగణం అంతా జనాలతో నిండిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. పోలీసులు ఆంక్షలు విధించడంతో రాజధాని చుట్టుపక్కల గ్రామాల వారు కాలినడకనే సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు.
అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. బుర్రకథ, కూచిపూడి నృత్యం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు శంకుస్థాపన మహోత్సవానికి విచ్చేసిన ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

మిమిక్రీ కళాకారుడు భవిరి రవి సినీ, రాజకీయ ప్రముఖులను అనుకరిస్తూ చేసిన మిమిక్రీ ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రముఖ సంగీత వాయిద్యకారుడు శివమణి ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. డ్రమ్స్‌తో లయబద్ధంగా వాయిస్తూ శివమణి చేసిన సంగీత ప్రదర్శన అతిథులను అలరించింది.
ఈ అరుదైన ఘట్టం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా రాష్ట్ర ప్రభుత్వమూ ఘనంగా ఏర్పాట్లు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. జపాన్, సింగపూర్ మంత్రులు, ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, వివిధ దేశాల రాయబారులు, పారిశ్రామిక వేత్తలు ఇప్పటికే సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

అమరావతి శంకుస్థాపన కార్యక్రమ విశేషాలు:
* శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యే లక్ష మందికి ఉచితంగా కాఫీ సరఫరా చేస్తామని కాంటినెంటల్ కాఫీ యాజమాన్యం ముందుకొచ్చింది.
* హెరిటేజ్ సంస్ధ లక్షన్నర మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపింది.
* తమిళనాడులోని వేలూరు స్వర్ణదేవాలయం నుంచి ఆవు, దూడలను శంకుస్థాపన కోసం ప్రత్యేకంగా పంపించారు.
* ప్రజలు కూర్చునే గ్యాలరీల్లో ప్రతి మూడు వేల మందికి ఒక అధికారిని సమన్యయకర్తగా నియమించారు.
* కార్యక్రమానికి వచ్చే రైతులు, ప్రజల కోసం 1.50 లక్షల ఆహార పొట్లాలు సిద్ధం చేశారు.
* వీఐపీలకూ ఆహార పొట్లాలు అందజేస్తున్నారు. వారికి ప్రత్యేకమైన మెనూ ఉంది. వీవీఐపీలకు ఎంఐపీలకు 100 మందికి వేదికవద్దే భోజన ఏర్పాట్లు చేశారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
అమరావతి ఖర్చు అసలు లెక్క ఇదీ..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..!












Click it and Unblock the Notifications