తిరుపతికి ప్రత్యేక రైళ్లు: రెండు రూట్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు
Special Trains: పండగ సీజన్ లో రైళ్లకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ సీజన్‌లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది.
సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు- పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు ఇదివరకే ప్రకటించారు. దసరా, దీపావళి పండగల సమయంలో ఏర్పడే రద్దీని ఎదుర్కొనడానికి సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశవ్యాప్తంగా రద్దీ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్నారు. గతంలో ప్రకటించిన ప్రత్యేక రైళ్లనూ పొడిగిస్తూ వస్తోన్నారు.

- తాజాగా మహారాష్ట్రలోని జాల్నా నుంచి తిరుచానూర్ వరకు 12 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. అక్టోబర్ చివరి వారం వరకూ ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
- నేటి నుంచి అక్టోబర్ 26వ తేదీ వరకు ప్రతి ఆదివారం సాయంత్రం 7:20 నిమిషాలకు జాల్నా నుంచి బయలుదేరే నంబర్ 07601 ప్రత్యేక రైలు మరుసటి రోజు సాయంత్రం 7:30 గంటలకు తిరుచానూర్ కు చేరుకుంటుంది.
- ఈ రైలు- పర్తూర్, సేలు, పర్బాణి, గంగాఖేర్, పార్లీ వైద్యనాథ్, లాతూర్ రోడ్, ఊద్గిర్, భాల్కీ, బీదర్, జహీరాబాద్, మర్పల్లి, వికారాబాద్, తాండూరు, సేడం, చిత్తాపూర్, సూలేహళ్లి, యాద్గిర్, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లి, పీలేరు, పాకాల, తిరుపతి మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.
- ఈ నెల 22 నుంచి అక్టోబర్ 27వ తేదీ వరకు ప్రతి సోమవారం రాత్రి 10:30 గంటలకు తిరుచానూర్ నుంచి బయలుదేరే నంబర్ 07602 ప్రత్యేక రైలు మరుసటి రోజు రాత్రి 9:30 గంటలకు జాల్నాకు చేరుకుంటుంది.
- మరో రూట్ లో ఈ రైలు తిరుగు ప్రయాణమౌతుంది. రేణిగుంట, రాజంపేట, నందలూరు, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూర్, క్రిష్ణ, యాద్గిర్, సులేహళ్లి, చిత్తాపూర్, సేడం, తాండూర్, వికారాబాద్, మర్పల్లి, జహీరాబాద్, బీదర్, భాల్కీ, ఊద్గిర్, లాతూర్ రోడ్, పార్లీ వైద్యనాథ్, గంగాఖేర్, పర్బాణి, సేలు, పర్తూర్ మీదుగా ప్రయాణిస్తుంది.












Click it and Unblock the Notifications