విశాఖపట్నం ప్రజలకు నరేంద్రమోడీ గుడ్ న్యూస్

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తుంటుంది. ఇందులో భాగంగా విశాఖపట్నం నుంచి పలు రైళ్లను అధికారులు పొడిగించారు. తిరుపతి, హైదరాబాద్, బెంగళూరుకు ఇవి అందుబాటులో ఉన్నాయి.

నెం. 08579 విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది. 2023 డిసెంబర్ 6 నుంచి 2024 జనవరి 31 వరకు పొడిగించారు. ఈ రైలు రాత్రి 7.00 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి తర్వాత రోజు ఉదయం 9.05 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

నెం. 08580 సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు ప్రతి గురువారం అందుబాటులో ఉంటుంది. 2023 డిసెంబర్ 7 నుంచి 2024 ఫిబ్రవరి 1 వరకు పొడిగించారు. రాత్రి 7.40 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి తర్వాతరోజు ఉదయం 9.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

special trains from vishakapatnam to bengaluru

దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది.

నెం. 08583 విశాఖపట్నం నుంచి తిరుపతికి ప్రతీ సోమవారం అందుబాటులో ఉంటుంది. 2023 డిసెంబర్ 4 నుంచి 2024 జనవరి 29 వరకు పొడిగించారు. రాత్రి 7.10 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి తర్వాత రోజు ఉదయం 9.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

నెం. 08584 తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. డిసెంబర్ 5 నుంచి 2024 జనవరి 30 వరకు పొడిగించారు. రాత్రి 9.55 గంటలకు తిరుపతిలో బయల్దేరి తర్వాతరోజు ఉదయం 10.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది
ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి స్టేషన్లలో ఆగుతుంది.

నెం. 08533 విశాఖపట్నం నుంచి బెంగళూరుకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది. 2023 డిసెంబర్ 3 నుంచి 2024 జనవరి 28 వరకు పొడిగించారు. ఈ రైలు మధ్యాహ్నం 3.55 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి తర్వాతరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది.

నెం. 08544 బెంగళూరు నుంచి విశాఖపట్నం వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. 2023 డిసెంబర్ 4 నుంచి 2024 జనవరి 29 వరకు పొడిగించారు. మధ్యాహ్నం 3.50 గంటలకు బెంగళూరులో బయల్దేరి తర్వాతరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడుదవోలు, తణుకు, భీమవరం, గుడివాడ, కైకలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్ పేట, కుప్పం, బంగారుపేట, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+