ఏపీలో శ్రీ సిమెంట్ భారీ ప్రాజెక్టు.. పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన.. సీఎం జగన్‌తో ప్రతినిధులు భేటీ
ఆంధ్రప్రదేశ్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకు వచ్చింది. గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఈ భారీ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు శ్రీ సిమెంట్ గ్రూప్ నిర్ణయించింది. ఈ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డితో ఆ సంస్థ ప్రతినిధులు సమావేశమైయ్యారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలపై చర్చించారు.

రు. 1500 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ సిమెంట్ ప్లాంట్
సుమారు రూ. 1500 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ సిమెంట్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామని శ్రీ సిమెంట్ గ్రూప్ ఎండీ హెచ్ ఎం. బంగూర్, జేఎండీ ప్రశాంత్ బంగూర్ లు వెల్లడించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో దీనిపై జగన్‌తో సంప్రదింపులు జరిపారు. దాచేపల్లి మండలంలోని పెదగార్లపాడు వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. ఇప్పటికే తొమ్మిది రాష్ట్రాల్లో తమ ప్లాంట్స్ నెలకొల్పినట్లు వారు సీఎంకు తెలిపారు..

జగన్‌కు కితాబు
రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని శ్రీ సిమెంట్ ఎండీ హెచ్ఎం బంగూర్ ప్రశంసించారు. ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.. ఏపీలో పారిశ్రామికరణ పెద్ద ఎత్తున జరగాని జగన్ కోరుకుంటున్నట్లు బంగూర్ తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్నారని అభినందించారు. సీఎం చిత్తశుద్ధిని చూసి తాము ఏపీలో ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.

ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
ఆంద్రప్రదేశ్ శ్రీ సిమెంట్ తొలిసారిగా ఇంత భారీ ప్లాంట్ చేస్తుంది. ఇప్పటికే పిడుగురాళ్ల ప్రాంతాలో పలు కంపెనీలు తమ సిమెంట్ ప్లాంట్‌లను నెలకొల్పి ఉన్నాయి. తాజా శ్రీ సిమెంట్ గ్రూప్ గ్రీన్ ఫీల్డ్ సిమెంట్ ప్లాంట్ ఏర్పాటుకు ముందకు వచ్చింది. దీంతో తో దాచేపల్లి చుట్టు పక్కల ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలనున్నాయి. తమ ప్లాంట్ ఏర్పాటుతో అనేక మందికి , ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలతో పాటు, వేలాది మందికి లబ్ది జరుగుతందని శ్రీ సిమెంట్ జేఎండీ ప్రశాంత్ తెలిపారు.
-
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్











Click it and Unblock the Notifications