TTD: మోహినీ రూపంలో అభయం - గరుడ సేవ వేళ భక్తుల కోసం..!!

Tirumala: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు ఉత్సవాల్లో భాగంగా మలయప్పస్వామి విశ్వ సుందరి మోహిని రూపంలో భక్తులకు దర్శనం
ఇచ్చారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన గరుడవాహన సేవకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికీ గ్యాలరీలు భక్తుల రద్దీతో నిండిపోయాయి. భక్తులకు అధికారులు కీలక సూచనలు చేసారు.

మోహినీ రూపంలో
తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గోవిందుడు మోహిని రూపంలో భక్తులకు దర్శనం
ఇచ్చారు. రంగు రంగుల పట్టు వస్త్రాలు ధరించి, మిరుమిట్లు గొలిపే ఆభరణాలు ధరించి, పల్లకిపై కూర్చొని, శ్రీ కృష్ణ స్వామితో కలసి మోహిని నాలుగు మాడ వీధుల్లో విహరించింది. పురాణాల ప్రకారం వేంకటేశ్వరుడు మణిపూసలు ధరించి మనోహరమైన మోహినిగా కనిపించడంతో రాక్షసులను గందరగోళంలో పడవేస్తుందని, దేవతలకు అనుకూలంగా జరిగిన ఖగోళ యుద్ధంలో విజయం సాధించిందని అర్చకులు తెలిపారు.

Sri Malayappa appeared as Mohini to charm His devotees on tuesday

తరలి వస్తున్న భక్తులు
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన గరుడవాహన సేవకు విస్తృత ఏర్పాట్లు చేశామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి వెల్లడించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు మెరుగైన సేవలు అందించేలా సూక్ష్మస్థాయిలో ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. భక్తుల రద్దీని పరిగణలోకి తీసుకొని వకుళామాత, వెంగమాంబ కేంద్రాల నుంచి అన్నప్రసాదాల పంపిణీ నిరంతం జరిగేలా చర్యలు చేపట్టామని వెంకయ్యచౌదరి తెలిపారు. మాడవీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులతో పాటు తిరుమలకు చేరుకొంటున్న భక్తులు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.

Sri Malayappa appeared as Mohini to charm His devotees on tuesday

గరుడ సేవ వేళ
స్వామి వారి గరుడవాహన సేవను వీక్షించేందుకు సుమారు మూడు లక్షల మంది భక్తులు వస్తారని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్యాలరీల్లో సుమారు రెండు లక్షల మంది వీక్షించేలా ఏర్పాట్లు సిద్ధం చేశారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భక్తుల తొక్కిసలాటకు తావులేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి తెలియజేశారు. అర్ధరాత్రి ఒంటిగంట వరకు భక్తులకు అందుబాటులో అన్నదాన సత్రం ఉండనుంది. మరోవైపు తిరుమల కొండకు భక్తులను తరలించేందుకు 3 వేల ట్రిప్పులను ఆర్టీసీ నడుపుతోంది. అర్ధరాత్రి ఒంటిగంట వరకు భక్తులకు అందుబాటులో అన్నదాన సత్రం ఉండనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+