Srisailam Maha Kumbhabhishekam : రేపటి నుంచి శ్రీశైలంలో మహాకుంభాభిషేకం...
ఆంధప్రదేశ్‌లో పుణ్యక్షేత్రాలకు కొదవే లేదు. అందులో ముఖ్యంగా రాయలసీమలో ప్రసిద్ధిచెందిన ఆధ్యాత్మిక కేంద్రాలు, పురాతన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో శ్రీశైల మల్లిఖార్జున స్వామి ఎంతో ప్రత్యేకమైన ఆలయం. ప్రాముఖ్యత సంతరించుకున్న ఆలయం కూడా. ఇక, ఈ ఆలయంలో ఫిబ్రవరి నెల 16 నుంచి 21 వరకు మహాకుంభాభిషేకం నిర్వహణకు ముహుర్తం ఖరారు చేశారు. 2013లో దేవదాయశాఖ కమిషనర్ జారీచేసిన సర్క్యులర్ ప్రకారమే ఈ కార్యక్రమాలను నిర్వహించాలని హైకోర్టు దేవదాయశాఖ అధికారులను ఆదేశించింది.
ఆంధప్రదేశ్‌లోని పుణ్యక్షేత్రాల్లో నిర్వహించే దైవసంబంధ కార్యక్రమాల్లో ఎలాంటి ఆగమ సంకరణ లేకుండా కార్యక్రమాలను నిర్వహించాలని అందులో పేర్కొన్నారు. మహాకుంభాభిషేకం నిర్వహణ నిమిత్తం గత సంవత్సరం మే 8, 10వ తేదీల్లో శ్రీశైలం దేవస్థానం ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను పరిగణలోకి తీసుకోవాలని కోరింది. ఇక, ఆలయంలోని మహాకుంభాభిషేకం నిర్వహణలో భాగంగా ఉపాలయాల్లో లింగ, యంత్ర ప్రతిష్ఠ, శివాజీ గోపురంపై కలశ స్థాపన కార్యక్రమాలు, వైదిక స్మార్త ఆగమం ప్రకారం నిర్వహించాలని గుంటురూకు చెందిన ముగ్గురు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరిలో గుంటూరుకు చెందిన పి.వెంకట బుచ్చిరామశాస్త్రి పాటు మరో ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నారు. కోర్టులో విచారణకు రాగా పిటిషనర్ల తరఫున లాయర్లు వాదనలు వినిపించారు. గతంలో నిర్వహించిన విధంగానే సంప్రోక్షణ కార్యక్రమాలను చేసే విధంగా దేవదాయదాఖ అధికారులకు ఆదేశివ్వాలని కోరారు. శ్రీశైల దేవస్థానంలో సంప్రోక్షణ కార్యక్రమాలను గతంలో శైవాగమ, వైదిక పద్ధతుల్లో నిర్వహించేవారు.

పూజాది కార్యక్రమాలన్నీ వీరశైవ ఆగమ పద్ధతుల్లోనే : శ్రీశైలంలోని అమ్మవారి దేవస్థానంలో నిర్వహించే మహాకుంభాభిషేకాన్నిస్మార్త ఆగమ పద్ధతిలో చేపడతామన్నారు. కలశస్థాపన, లింగ, యంత్ర ప్రతిష్ఠలను వీరశైవాగమ రిత్వికులు కూడా నిర్వహిస్తారని కోర్టులో దేవదాయశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది వాదించారు. శ్రీశైల పుణ్యక్షేత్రంలో పూజాది కార్యక్రమాలన్నీ వీరశైవ ఆగమ పద్ధతుల్లోనే ఉంటాయని అఖిలభారత వీరశైవ ఆగమ పరిషత్ తరఫు న్యాయవాది వివరించారు. ఇక, శ్రీశైల ఆలయంలో జరిగే కుంభాభిషేకం ఇతర కార్యక్రమాలు వంటి వివరాలన్నీ దేవదాయశాఖ కమిషనర్‌కు ఆలయ ప్రధాన అర్చకులు, వేదపండితులు రాసిన లేఖలో పేర్కొన్న వివరాలను పరిగణలోకి తీసుకోవాలని కోరు సూచించడం జరిగింది.












Click it and Unblock the Notifications