బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి భక్తుల కోసం తిరుమలలో..

Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగుతోంది. ఆదివారం నాడు 84,060 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 34,985 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.01 కోట్ల రూపాయల ఆదాయం టీటీడీకి అందింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. కిటకిటలాడాయి. ట్రావెలర్స్ బంగళా సర్కిల్ వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. క్యూ లైన్లు, కంపార్లమెంట్లల్లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు అల్పాహారం, మంచినీళ్లు, పాలు పంపిణీ చేశారు.

Srivari Brahmotsavalu 2024 TTD AEO Venkaiah Chowdhary hold review meeting on arrangements

అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు తిరుమలలో నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా జరుగనున్నాయి. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమౌతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయి.

4వ తేదీన సాయంత్రం 5:45 నుంచి 6 గంటల వరకు వేదమంత్రోచ్ఛారణల మధ్య ధ్వజారోహణం చేస్తారు శ్రీవారి అర్చకులు. రాత్రి 9 గంటలకు శ్రీమలయప్ప స్వామివారిని పెద శేష వాహనంపై ఊరేగిస్తారు. 5న ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు వచ్చే లక్షలాదిమంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టారు. రోజూ లక్షమంది వరకు భక్తులు శ్రీవారిని దర్శించే అవకాశం ఉందని అంచనా వేస్తోన్నారు. ఈ నేపథ్యంలో వివిధ విభాగాలపై అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు.

తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం సాయంత్రం ఈ సమీక్షా సమావేశం ఏర్పాటైంది. సీవీఎస్‌వో శ్రీధర్‌, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఇందులో పాల్గొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడానికి సంబంధిత విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని వెంకయ్య చౌదరి సూచించారు.

ఈ సందర్భంగా సీవీఎస్‌వో శ్రీధర్.. నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలు, భక్తులు రాకపోకలు సాగించే మార్గాలు, అక్కడ వారికి కల్పించాల్సిన సౌకర్యాలు, రద్దీని నివారించడానికి చేపట్టాల్సిన చర్యలు, వాహనాల, పార్కింగ్ స్థలాలు, భద్రత సిబ్బంది, రోప్ పార్టీలు.. ఇతరత్రా అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. వాటిపట్ల అదనపు ఈఓ సంతృప్తి వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+