17వ తేదీ వరకు తిరుపతి శ్రీవారి ఆలయంలో దర్శనాలు ఉండవు
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు 52,731 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 17,664 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.24 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
కాగా- తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద గల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం, శ్రీ లక్ష్మీ నారాయణస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ గోదా అమ్మవారి ఆలయంలో అష్టబంధనం కారణంగా బాలాలయ సంప్రోక్షణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా ప్రారంభం అయ్యాయి. 3వ తేదీన పూర్ణాహుతితో ఈ కార్యక్రమాలు ముగియనున్నాయి.

ఇందులో భాగంగా శనివారం ఉదయం 8 గంటలకు పుణ్యాహవచనం, వాస్తు హోమం, అకల్మష హోమం, రక్షాబంధనం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా చేపట్టారు. సాయంత్రం 6 గంటలకు కుంభస్థాపన, కళాకర్షణ, అగ్నిప్రతిష్ట, కుంభాలను యాగశాలకు తీసుకొచ్చి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ ఉదయం 8 గంటలకు యాగశాలలో పంచ గవ్యాదివాసం, క్షేరాధివాసం, జలదివాసం నిర్వహించనున్నారు. సాయంత్రం వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. సోమవారం ఉదయం 8 గంటలకు యాగశాలలో పూర్ణాహుతి, కుంభ ప్రదక్షణ నిర్వహిస్తారు. ఉదయం 9:20 నుండి 9:55 గంటల మధ్య మేష లగ్నంలో బాలాలయ సంప్రోక్షణం చేపడతారు.
ఈ సంప్రోక్షణ పనులు ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సందర్భంగా అలిపిరి పాదాల మండపం వద్ద గల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం, శ్రీ లక్ష్మీ నారాయణస్వామివారి ఆలయంలో దర్శనాలు ఉండవు.
గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం బాలాలయం కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకోసం ఆలయంలోని ముఖ మండపంలో నమూనా ఆలయం ఏర్పాటు చేసి గర్భాలయంలోని మూలవర్ల చిత్రపటాలను ఏర్పాటు చేస్తారు. తదుపరి మహా సంప్రోక్షణ జరిగే వరకు స్వామి, అమ్మవార్లకు నిత్య కైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తారు.
Darshan at Srivari Temple, Alipiri Padala Mandapam will be unavailable from March 1st, 5 PM to March 17th, 5 PM due to Balalayam.#TTD #Tirupati #SrivariDarshan #Balalayam#wesupportttd #dontbelieverumours pic.twitter.com/PXsyedw7OU
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) March 1, 2025
ఆయా వైదిక కార్యక్రమాలన్నీ కూడా శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, వైఖానస ఆగమ సలహాదారు మోహన రంగాచార్యుల ఆధ్వర్యంలో కొనసాగనున్నాయి.












Click it and Unblock the Notifications