స్థానిక ఎన్నికల్లో ఓటు ఉందా, ఇలా చెక్ చేసుకోండి - లేకపోతే వెంటనే..!!
ఏపీలో స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదల అయింది. పార్టీలు అభ్యర్ధుల ఎంపిక పైన కసరత్తు చేస్తున్నాయి. కూటమి పార్టీల సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. మాజీ సీఎం జగన్ సైతం పార్టీ అభ్యర్ధుల ఖరారు పైన దిశా నిర్దేశం చేసారు. ఈ రోజు నుంచి నామినేషన్లు ప్రారంభం అయ్యాయి. ఇక.. ఓటర్లకు ఎన్నికల సంఘం సూచనలు చేస్తోంది. ఓటు నుంచి పోలింగ్ కేంద్రం వరకు పూర్తి సమాచారం అందుబాటులోకి తెచ్చింది. ఓటు లేకపోతే ఏం చేయాలో స్పష్టత ఇస్తోంది.
స్థానిక సమరం మొదలైంది. ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరిగేలా షెడ్యూల్ ఫిక్స్ చేసారు. 30న ఫలితాలు వెల్లడి కానున్నాయి. కాగా.. ఎన్నికల వేళ అభ్యర్ధులతో పాటుగా ఓటర్లకు సంబంధించిన పూర్తి సమాచారం ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చింది. ఆన్ లైన్ లోనే అన్ని వివరాలు పొందేలా వెసులుబాటు కల్పించింది. ఇందు కోసం ఎన్నికల కమిషన్ తన పోర్టల్ను ఆధునికీకరించింది. ఈ పోర్టల్ https://sec-ems.ap.gov.in/apsec/లో ఓటర్లు, ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు ఉపయోగపడేలా పలు కొత్త ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పోర్టల్ ద్వారా ఫొటో ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్) నంబరు నమోదు చేసి ఓటర్లు తమ వివరాలను తెలుసుకోవచ్చు. ఈ నంబరు అందుబాటులో లేకపోతే వ్యక్తిగత వివరాలను నమోదు చేసి ఎపిక్ నంబరును పొందే అవకాశం లక్పించారు.

మొత్తం వివరాలు అందుబాటులో
అదే విధంగా జిల్లా, మండలం, గ్రామ పంచాయతీ, కార్పొరేషన్, మున్సిపాలిటీ డివిజన్లు, వార్డుల వారీగా మొత్తం ఓటర్ల సంఖ్యను తెలుసుకోవచ్చు. పురుషులు, మహిళలు, ఇతర ఓటర్ల సంఖ్యకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి తెచ్చారు. ఓటరు తమ ఓటుతో పాటుగా తమ కు కేటాయించిన పోలింగ్ కేంద్రం చిరునామా, లొకేషన్ వివరాలను తెలుసుకునే అవకాశం కల్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏయే స్థానాలను ఏ కేటగిరీకి కేటాయించారనే పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. అభ్యర్థుల వివరాల కోసం ప్రత్యేకంగా 'అభ్యర్థుల పోర్టల్' ఆప్షన్ను అందుబాటులో ఉంచారు. ఇప్పటికే షెడ్యూల్ విడుదలతో ఎన్నికల కోడ్ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. మున్సిపల్ ఎన్నికలతోపాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేలా షెడ్యూల్ ప్రకటించారు.













Click it and Unblock the Notifications
