ఫ్రెండ్ ఇంట్లో ఉంచి, 15 రోజులు సవతి తండ్రి అత్యాచారం
హైదరాబాద్: బాలిక పైన సవతి తండ్రి అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాదులోని వట్టేపల్లికి చెందిన పదిహేడేళ్ల బాలికను ప్రభుత్వోద్యోగి అయిన ఆమె సవతి తండ్రి పదిహేను రోజుల క్రితం టోలీచౌకిలోని స్నేహితుడి ఇంట్లో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాధితురాలు షిరాడ్ ఉమెన్ అండ్ చైల్ట్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలుకు తన గోడును వెళ్లబోసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, అత్యాచారం జరిగినట్లు తమకు సమాచారం అందలేదని పోలీసులు చెబుతున్నారు.
కృష్ణా జిల్లాలో హత్య

కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గంపలగూడెం మండలం వినడప వంతెన వద్దకు ఓ వ్యక్తిని కొందరు ఆటోలో తీసుకువచ్చారు. జనం మొత్తం చూస్తుండగా, ప్రాణభయంతో ఉన్న అతన్ని నడి రోడ్డుపై అత్యంత పాశవికంగా నరికి చంపారు.
అనంతరం వచ్చిన ఆటోలోనే వెళ్లిపోయారు. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. దీనిపై పోలీసులకు సమాచారమందించారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకున్నారు, కేసును దర్యాఫ్తు చేస్తున్నారు.
మహిళ దారుణ హత్య
కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలుంలో చంద్రశేఖర్‌రెడ్డి భార్య శింగనపల్లె వరలక్ష్మీదేవి(46)ని గురువారం గుర్తుతెలియని దుండగులు ఇంట్లో హత్య చేసి బంగారం దోచుకెళ్లారు.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications