విశాఖలో 'వింత జీవులు' ఎక్కడున్నాయంటే!: ఆ భవనంలో ఇలా గుర్తించారట..
ఒడిశా స్టీవ్‌డోర్స్ లిమిటెడ్ భవనంలోని మూడో అంతస్తులో ఈ పక్షులను గుర్తించారు.
విశాఖ: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విశాఖ వింత పక్షుల ఆచూకీ దొరికింది. విశాఖలో ఇవి ఎక్కడున్నాయో అధికారులు గుర్తించారు. విశాఖ వన్‌టౌన్ పోలీసు స్టేషన్ సమీపంలోని ఒడిశా స్టీవ్‌డోర్స్ లిమిటెడ్ అనే షిప్పింగ్ సంస్థ బాత్‌రూమ్ గది పైభాగంలో ఇవి ఉన్నట్టు గుర్తించారు.
చూడటానికి గుడ్లగూబల్లాగే ఉన్నా.. ఇవి ఏ జాతి పక్షులు, ఎక్కడినుంచి వచ్చాయి? అన్నది అంతుచిక్కడం లేదు. కొంతమంది మరో అడుగు ముందుకేసి వీటిని ఏలియన్స్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఒడిశా స్టీవ్‌డోర్స్ లిమిటెడ్ భవనంలోని మూడో అంతస్తులో ఈ పక్షులను గుర్తించారు.

ఆ సంస్థ జీఎం జేకె నాయక్ దీనిపై స్పందించారు. 15రోజుల క్రితం ఆఫీస్ గదిలో వింత శబ్దాలతో పాటు తీవ్ర దుర్వాసన వస్తుండటంతో అన్ని చోట్ల గాలించామన్నారు. ఇదే క్రమంలో బాత్‌రూమ్‌లోని పీఓపీ సీలింగ్‌పై చూడగా మూడు వింత ఆకృతిలో ఉన్న పక్షులు కనిపించాయని చెప్పారు.
గుడ్లగూబల కన్నా ఎత్తుగా పొడవు కాళ్లతో వింత శబ్దాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. తాము పెట్టే ఆహారమేది అవి తీసుకోవడం లేదని తెలిపారు. బాత్‌రూమ్‌కు ఉన్న రంధ్రం ద్వారా తల్లి పక్షి బయటకు వెళ్లి ఏదో ఆహారం తీసుకొస్తుందని చెప్పారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications