కంకిపాడులో వింత: పాలిస్తున్న మేకపోతు.. ఆశ్చర్యంలో స్థానికులు..

కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామంలో ఓ మేకపోతు పాలు ఇవ్వడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

కంకిపాడు: చూడబోతే ఇదేదో బ్రహ్మం గారు చెప్పిన వింత తరహాలోనే ఉంది. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామంలో ఓ మేకపోతు పాలు ఇవ్వడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నక్కా రాంబాబుకు అనే రైతుకు చెందిన మేకపోతుకు పొదుగు ఉండటం.. దాని నుంచి పాలు కూడా వస్తుండటం ఇప్పుడక్కడ చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల మేకపోతును మందలో కలిపే సమయంలో.. వృషణాలను ఆనుకుని రొమ్ము ఉండటాన్ని గుర్తించాడు. ఆపై వాటిని పరీక్షించగా.. రొమ్ము నుంచి పాలు రావడం గమనించాడు. విషయాన్ని స్థానికంగా ఉన్న జీవాల పెంపకందారులు, స్థానికులకు చెప్పడంతో.. వారంతా దాన్ని చూసి ఆశ్చర్యపోయారు.

strange: male goat gives milk in kankipadu krishna district

ప్రస్తుతం ఆ మేకపోతు పాలే రాంబాబు పెంచుకుంటున్న కుక్క పోషణకు ఉపయోగపడుతున్నాయి. ప్రతీరోజు రాంబాబు ఇంటి కుక్క ఆ మేకపోతు పాలే తాగుతుందని చెబుతున్నారు. కాగా, మేకపోతుకు పాలు వస్తున్న విషయాన్ని కంకిపాడు పశు వైద్యాధికారి డాక్టర్ కర్నాటి మాధవరావును సంప్రదించగా హార్మోన్ మార్పుల వల్లే ఇలా జరుగుతుందని తెలపడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+