రామ్ చరణ్‌తో విరాట్ కోహ్లీ బయోపిక్.. పాన్ ఇండియా మూవీ ప్లానింగ్

అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. కియారా అద్వాని హీరోయిన్. తమిళ టాప్ దర్శకుడు శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తోన్నారు. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. 170 కోట్ల రూపాయల బడ్జెట్‌తో చిత్రీకరణ జరుపుకొంటోన్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది.

ఆచార్య తరువాత రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా ఇదే కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఆచార్యలో తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి కీలక పాత్రలో పోషించాడు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆచార్య మెగా అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. దీని తరువాత శంకర్ సినిమా గేమ్ ఛేంజర్‌కు సైన్ చేశారు రామ్ చరణ్.

Ram Charan

ఈ ఏడాది చివర్లో సినిమా విడుదల అవుతుందనే బజ్ ఉంది. ఈ సినిమా తరువాత రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటనేది ఆసక్తి రేపుతోంది. గేమ్ ఛేంజర్ సినిమా దాదాపుగా పూర్తి కావచ్చినప్పటికీ.. ఇప్పటివరకు కొత్త సినిమాను ఏదీ పట్టాలపైకి ఎక్కించలేదు మెగా పవర్ స్టార్. కొన్ని మేజర్ ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి.

ఈ పరిస్థితుల్లో మరో కొత్త డిబేట్ తెర మీదికి వచ్చింది. రామ్ చరణ్ తన తరువాతి సినిమాను ఫైనలైజ్ చేశారనే ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్‌లో భారీ సినిమాను చేయబోతోన్నారనే టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. స్పోర్ట్స్ డ్రామాగా చిత్రీకరణ జరుపుకోవచ్చని తెలుస్తోంది.

Virat Kohli

భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ మెషీన్ విరాట్ కోహ్లీ బయోపిక్‌లో నటించడానికి రామ్ చరణ్ ఇంట్రెస్ట్ చూపిస్తోన్నాడని, గేమ్ ఛేంజర్ తరువాత ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్తుందని తెలుస్తోంది. ఇదివరకు ఇండియాటుడే కాంక్లేవ్‌లో పాల్గొన్నప్పుడు కూడా రామ్ చరణ్.. విరాట్ కోహ్లీ బయోపిక్‌పై ఆసక్తి చూపిన విషయం తెలిసిందే.

బాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్‌గా ఉన్న ఓ బ్యానర్.. రామ్ చరణ్‌తో విరాట్ కోహ్లీ బయోపిక్‌ను తీయడానికి ముందుకొచ్చినట్లు చెబుతున్నారు. బాలీవుడ్‌లో స్పోర్ట్స్ డ్రామాలు, బయోపిక్స్ కొత్తేమీ కాదు. మహేంద్రసింగ్ ధోనీ బయోపిక్ సూపర్ హిట్. మిల్కాసింగ్, సైనా నెహ్వాల్ క్రీడా జీవితం మీదా సినిమాలొచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+