'సుడిగాలి' సుధీర్ ఆస్తుల విలువ

బుల్లితెరపై సుడిగాలి సుధీర్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు సుమా.. ఆస్తులు కూడబెట్టడంలో ప్రముఖ హీరో శోభన్ బాబు ని మించిపోయాడు. పలు ప్రాంతాల్లో కూడబెట్టిన ఆస్తులతో రంగుల ప్రపంచంలో ఎంతోమందికి ఆదర్శవంతంగా నిలుస్తున్నాడు. చిన్న డ్యాన్సర్ గా ఒక డాన్స్ స్కూల్ లో కెరీర్ ప్రారంభించి హోం ట్యూషన్లు చెబుతూ సినిమా, టీవీ రంగాల్లో అవకాశాల కోసం ఎంతో కష్టపడ్డాడు.

తన కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. అలాగే సంపాదించిన ప్రతి రూపాయిని సరైనచోట పెట్టుబడి పెడుతున్నాడు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి పాపులర్ టీవీషోలు చేస్తున్నాడు. టీవీ షోకు ఒకరోజుకు రూ.2 నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేస్తున్నాడు. సినిమాలో నటించేందుకు కోటిరూపాయల పైనే పారితోషికం అందుకుంటున్నాడు. సుధీర్ కు రెండు ఖరీదైన బైక్స్, రెండు కార్లతోపాటు మంచి ఫ్లాట్ ఉంది.

sudigali sudheer property value details

తాజాగా సుధీర్ హైదరాబాద్ కి 100 కిలోమీటర్ల దూరంలో 30 ఎకరాలపైన వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. ఈ భూమిలో ఆర్గానికి వ్యవసాయం చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నాడు. ల్యాండ్ కు ఒక షేప్ కూడా వచ్చిందని, ఈ 30 ఎకరాల్లోని 10 ఎకరాల భూమిలో కూరగాయలను ప్రాసెస్ చేసే యూనిట్ పెట్టడానికి సిద్ధమవుతున్నాడు. వేలమంది రైతులు పండించిన పంటకు ఈ ప్రాసెస్ యూనిట్ ద్వారా భద్రత కల్పించబోతున్నాడు. రానున్న రోజుల్లో తినబోయే తిండికి విపరీతమైన డిమాండ్ ఏర్పడబోతోంది. అందులోను ఎటువంటి క్రిమి సంహారక మందులు వాడకుండా సహజంగా పండించిన పంటలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ తరహా పంటలవల్ల ఎంతో లాభం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అతి సాధారణ కుటుంబం నుంచి సినిమా హీరోగా ఎదిగిన సుధీర్ ఆదర్శవంతమైన బాటలో ఎంతో ముందుచూపుతో ఉన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+