రాహుల్‌కి బ్రాహ్మణ యువతితో పెళ్లి చేయాలని చెప్పా, ఎందుకంటే..?: జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు
Recommended Video

అమరావతి/న్యూఢిల్లీ: ఎప్పుడూ ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకెక్కే తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వివాహ విషయంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల నిర్వహించిన ఓ సభలో అనంతపురం ఎంపీ మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు.. రాహుల్ గాంధీకి ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మంచి బ్రాహ్మణ అమ్మాయితో వివాహం జరిపించాలని సోనియా గాంధీకి తెలిపానని చెప్పారు.
When I was in Congress I suggested to Sonia Gandhi that Rahul needs support of UP Brahmins. Brahmin community is ruling in UP.That is why I suggested to her that get Rahul married to a good Brahmin girl . But Sonia Gandhi didn’t listen to me: JC Diwakar Reddy,TDP MP (4.7.18) pic.twitter.com/AXHl1MR5UA
— ANI (@ANI) July 6, 2018
ఉత్తరప్రదేశ్‌లో బ్రాహ్మణులదే పైచేయి అని, కాంగ్రెస్ పార్టీకి బ్రాహ్మణుల మద్దతు కావాలన్న జేసీ దివాకర్ రెడ్డి.. బ్రాహ్మణ యువతితో పెళ్లి జరిపిస్తే వారి సామాజిక వర్గ మద్దతు లభిస్తుందని సోనియాకు చెప్పానని తెలిపారు.

అయితే, తన సూచనను సోనియా పట్టించుకోలేదని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. జూలై 4న జరిగిన ఓ కార్యక్రమంలో జేసీ దివాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చే శారు. వాస్తవానికి రాహుల్ గాంధీ పెళ్లిపై అనేక వదంతులు వస్తూనే ఉన్నాయి. ఇటీవల రాయ్‌బరేలీ ఎమ్మెల్యే సదర్ అదితి సింగ్.. కాంగ్రెస్ చీఫ్‌కు ప్రపోజ్ చేసినట్లు వార్తలు వ్యాపించాయి. రాహుల్, అదితి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే రాహుల్ తనకు సోదరుడి లాంటి వాడని ఆమె ఆ వార్తల్ని కొట్టిపారేశారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications