రూ.250తో ఖాతా తెరిస్తే.. 72లక్షలు అందించే సూపర్ స్కీమ్!
ఆడపిల్ల పుడితే తల్లిదండ్రులకు భారం కాకూడదు అన్న ఉద్దేశంతో, వారి బంగారు భవిష్యత్తుకు ఆర్థికంగా అందుకు నిలవాలన్న నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి పథకాన్ని తీసుకు వచ్చింది. ఈ పథకం ద్వారా ఇప్పటికే బాలికలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న కేంద్రం సుకన్య సమృద్ధి పథకంలో మరో మైలురాయి చేరుకుంది.
11ఏళ్ళు పూర్తి చేసుకున్న సుకన్య సమృద్ధి యోజన
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సుకన్య సమృద్ధి యోజన విజయవంతంగా 11ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆడపిల్లల ఉన్నత చదువులు, పెళ్లి ఖర్చుల కోసం అందిస్తున్న ఈ పథకం ఇప్పుడు ఇన్వెస్టర్లకు కూడా మంచి రాబడినిస్తోంది. ఇందులో వార్షిక పెట్టుబడి రూ.1.5లక్షలు, 15 ఏళ్ల పెట్టుబడి కాలం పాటు పెడితే 21ఏళ్ల మెచ్యూరిటీ కాలంలో ప్రస్తుత 8.20% వడ్డీ రేటుతో రూ.22.5లక్షల పెట్టుబడికి రూ.49.32లక్షల వడ్డీతో మొత్తం రూ.71.82లక్షలు వస్తాయి.

ప్రభుత్వ హామీతో రిస్క్ లేకుండా స్కీం బెనిఫిట్స్
ఈ పథకం ప్రభుత్వ హామీతో రిస్క్ లేకుండా, సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఉంది. పాప 10 ఏళ్లలోపు, నెలకు రూ.250తో కూడా ఖాతా తెరవవచ్చు. 18 ఏళ్లు నిండిన తర్వాత ఉన్నత చదువులకు 50% విత్‌డ్రా చేసుకోవచ్చు. కేంద్రం తీసుకువచ్చిన ఈ పథకం 2015 జనవరిలో అధికారికంగా ప్రారంభం కాగా పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈ పథకం అమలు అవుతుంది.
250 రూపాయలతో ఖాతా, గరిష్టంగా ఈ మొత్తం జమ
ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు బాలికల పేర్లపైన సుకన్య సమృద్ధి ఖాతాలను ప్రారంభించే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. కేవలం 250 రూపాయలతో ఖాతాను తెరిచి ఈ ఖాతాలో ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా 250 రూపాయలు, గరిష్టంగా ఒక లక్ష 50 వేల రూపాయలను జమ చేయవచ్చు. ఖాతా ప్రారంభించిన నాటి నుండి 15 సంవత్సరాల పాటు డిపాజిట్ చేయవలసి ఉంటుంది.
ప్రభుత్వం నిర్ణయించిన వడ్డీకే స్కీమ్
ఈ పథకంలో జమ చేసిన మొత్తానికి ప్రభుత్వమే నిర్ణయించిన ఆకర్షణీయమైన వడ్డీ ఇస్తుంది. బాలికల చదువుకు, వారి పెళ్లికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆ తర్వాత 21 సంవత్సరాలు వచ్చాక మొత్తం డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా కేంద్రం అందిస్తున్న ఈ పథకం ఆడపిల్లల పాలిట వరం కాగా, దేశవ్యాప్తంగా చాలా మంది ఈ పథకం ద్వారా తమ బిడ్డల భవిష్యత్తుకు ఇప్పటి నుంచే పొదుపు ప్రారంభిస్తున్నారు.












Click it and Unblock the Notifications