Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కూల్ న్యూస్: 16ఏళ్ళ త్వరాత ఇంత ముందస్తుగా కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

వాతావరణ శాఖ సూపర్ కూల్ న్యూస్ చెప్పింది. దేశంలో అత్యధికంగా వర్షపాతాన్ని ఇచ్చే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని, సహజంగా మరో ఎనిమిది రోజుల తర్వాత కేరళ తీరాన్ని దాకా ఉన్న ఋతుపవనాలు, ముందస్తుగానే కేరళ తీరాన్ని తాకాయి అని పేర్కొంది. దీంతో మరో రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి విస్తరించే అవకాశం ఉందని, ఈసారి తెలుగు రాష్ట్రాలలో ముందస్తుగానే వర్షాకాలం ప్రారంభం అవుతుందని పేర్కొంది.

ముందస్తుగా పలకరించిన రుతుపవనాలు, ఏపీలో అప్పటినుండే వర్షాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి మరో రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉన్న నేపథ్యంలో వీటి ప్రభావంతో జూన్ రెండో వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా జూన్ ఒకటవ తేదీకి రుతుపవనాలు పలకరిస్తాయి. ఈసారి మాత్రం మే నెలలోనే ముందస్తుగా రుతుపవనాలు పలకరిస్తున్నాయి.

super cool news southwest mansoon hits kerala soon it will enter in ap

గత 16ఏళ్ళలో ఇప్పుడే ముందస్తు రుతుపవనాల పలకరింపు

గత 16 ఏళ్లలో ముందస్తుగా ఋతుపవనాలు పలకరించడం ఇదే మొదటిసారి. 2009లో మే 23వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ఇక పోయిన సంవత్సరం మే 31 తేదీన అంతకుముందు 20లో జూన్ 1న 2021లో జూన్ 3న 2022లో మే 29న 2023 లో వారం రోజులు ఆలస్యంగా జూన్ 8వ తేదీన ఋతుపవనాలు కేరళకు వచ్చాయి.

అత్యధికంగా వర్షాలు కురిసే అవకాశం
ఈసారి ఇప్పటికే నైరుతి రుతుపవనాలు కేరళను తాకడంతో ఈసారి అత్యధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇదిలా ఉంటే భారతదేశంలో 52% నికర సాగు భూమి వర్షాధారంగా నే ఉంది. ఈ క్రమంలో నైరుతి రుతుపవనాలు కీలక భూమిక పోషిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు సక్రమంగా వస్తేనే, వర్షాలు కురిస్తేనే భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుంది.

నైరుతి రుతుపవనాల ఆగమనం తీపి కబురు
దేశంలో వర్షాధారంగా సాగుతున్న భూమి నుంచి 40 శాతం దిగుబడి వస్తుంది. ఇక మన వ్యవసాయ రంగానికి ఊతం ఇవ్వడానికే కాకుండా తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి తదితర అవసరాలకు కూడా వర్షపాతమే ఆధారం. కనుక నైరుతి రుతుపవనాల ఆగమనం దేశానికి తీపి కబురు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+