రైల్వే ప్రయాణికులందరికీ సూపర్ న్యూస్.. త్వరలో ఆ కష్టాలకు చెల్లు!
భారతీయ రైల్వే ప్రగతిపథంలో దూసుకుపోతుంది. రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తున్న రైల్వే శాఖ ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని కలిగించేలాగా పనిచేయడంలో ముందు వరుసలో ఉంటుంది. భారతదేశంలో ముఖ్యమైన రవాణా మార్గాలలో ఒకటైన రైలు రవాణా మార్గాన్ని మరింత అడ్వాన్స్డ్ గా మారుస్తున్న రైల్వే శాఖ వివిధ ప్రాంతాలకు ప్రయాణాలు చేయాలని భావించే వారికి కావలసిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వివిధ యాప్స్ ద్వారా అందిస్తుంది.
రైల్వే సేవల కోసం చాలా యాప్స్
లక్షలాదిమందిని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి చేరవేస్తున్న రైల్వే సమాచారం తెలుసుకోవడం కోసం మనకు అందుబాటులో చాలా యాప్స్ ఉన్నాయి. రైళ్ల టైమింగ్స్ కోసం ఒక యాప్, రైల్వే యాత్ర స్పెషల్ విశేషాలతో ఇంకొక యాప్, రైల్వే టికెట్ బుకింగ్ , ట్రైన్ స్టేటస్ , టైమింగ్స్ ఇటువంటి సేవలు కోసం అనేక యాప్స్ ను మనం ఉపయోగిస్తున్నాం.

రైల్వే సేవలు ఒకే యాప్ ద్వారా తెలిపేలా
రైల్వే సేవలకు సంబంధించి వివిధ సమాచారం తెలుసుకోవడం కోసం యాప్స్ మాత్రమే కాకుండా వెబ్సైట్లు కూడా అనేకం అందుబాటులో ఉన్నాయి.. అయితే వీటి ద్వారా ప్రయాణికులు తమకు అవసరమైన విషయాలను గురించి సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రైల్వే ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి నిర్ణయం తీసుకున్న రైల్వే శాఖ అన్ని సేవల సమాచారం ఒకే యాప్ ద్వారా తెలియజేసేలా సరికొత్త యాప్ ను రూపొందిస్తోంది.
ఐఆర్సీటీసీ సూపర్ యాప్
రైల్వేకు సంబంధించి ఒక్కొక్క సేవకు ఒక్కొక్క యాప్ ఉపయోగించడం ప్రయాణికులకు కష్టంగా మారుతుందని భావించిన రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఒక సరికొత్త యాప్ ను తీసుకువస్తుంది. ఐ ఆర్ సి టి సి సూపర్ యాప్ పేరుతో ఈ యాప్ ద్వారా రైల్వే కి సంబంధించిన అన్ని రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి.
డిసెంబర్ చివరి నాటికి అందుబాటులోకి సూపర్ యాప్
ఈ యాప్ లో మనం రైల్వే టికెట్స్ బుకింగ్ చేసుకోవడమే కాకుండా పిఎన్ఆర్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అంతే కాదు ట్రైన్ ట్రాకింగ్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్లాట్ఫామ్ టికెట్ నుండి జనరల్ టికెట్ వరకు ఈ యాప్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రయాణ సమయంలో ఫుడ్ ఆర్డర్ చేసే సదుపాయం కూడా\ ఉంటుంది. అయితే డిసెంబర్ చివరినాటికి ఐఆర్సిటిసి సూపర్ యాప్ అందుబాటులోకి రానున్నట్టు సమాచారం.
రైల్వే ప్రయాణికులకు వరంగా సూపర్ యాప్
ఇప్పటికే ఐఆర్ సీటీసీ రైలు కనెక్ట్ యాప్ ను కొట్లాదిమంది వినియోగిస్తున్నారు. ఇది అత్యంత ప్రజాదరణ పొందిన రైల్వే యాప్. ఇక ఇదే స్థానంలో ఇప్పుడు భారతీయ రైల్వే ఐఆర్సిటిసి సూపర్ యాప్ ను సిద్ధం చేస్తోంది. ఇండియన్ రైల్వే టూరిజం కార్పొరేషన్ అండ్ క్యాటరింగ్ తో ఈ యాప్ ను అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తానికి ఒకటే యాప్ లో రైల్వే కి సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకునేలా రూపొందిస్తున్న ఈ సూపర్ యాప్ రైల్వే ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వేస్ అందిస్తున్న వరం.












Click it and Unblock the Notifications