చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై జడ్డీల భిన్నాభిప్రాయాలు-నిర్ణయం సీజేకు బదిలీ..
గతేడాది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదు చేసిన కేసుకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందా లేదా అన్న దానిపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పు ఇవ్వాల్సిన తరుణంలో ద్విసభ్య ధర్మాసనంలో ఇద్దరు జడ్జీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ కేసును విచారించిన ద్విసభ్య ధర్మాసనంలోని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదీ ధర్మాసనం చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందా లేదా అన్న దానిపై ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది.

స్కిల్ కేసులో తనపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్, అరెస్టు, రిమాండ్ కు సెక్షన్ 17ఏ వర్తిస్తుందని వాదిస్తూ గతంలో ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు.. హైకోర్టు తోసిపుచ్చడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై గతేడాదే విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును మాత్రం సుదీర్ఘంగా రిజర్వు చేసింది. ఇవాళ తీర్పు వెలువరించిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదీ ధర్మాసనం ఈ విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది.
చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తించదని సుప్రీంకోర్టు బెంచ్ లో జస్టిస్ బేలా త్రివేదీ తీర్పులో తెలిపారు. అలాగే ట్రయల్ కోర్టు (విజయవాడ ఏసీబీ కోర్టు ) నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని కూడా తెలిపారు. కానీ మరో న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ బోస్ మాత్రం ఈ తీర్పుతో విభేదించారు. చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందన్నారు. దీని ప్రకారం చంద్రబాబును సీఐడీ అరెస్టు, దిగువ కోర్టు రిమాండ్ విధించడం కరెక్ట్ కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసుపై ఎలాంటి తీర్పూ ఇవ్వలేదు. చివరికి చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను సీజేఐ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications