నామినేషన్ల గడువు పెంపు 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల దాఖలు సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన అనంతరం పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. ఈ తీర్పు వెలువడిన వెంటనే విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో అత్యవసర సమావేశం ఏర్పాటైంది. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్ఈసీ కార్యదర్శి మల్లికార్జున, పోలీస్ ఇన్ స్పెక్టర్ జనరల్ రాజకుమారి, ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా దాడులకు పాల్పడిన 19 మున్సిపాలిటీల్లో ఈ దఫా పారదర్శకంగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను అధికారులు పరిశీలించారు. నామినేషన్ల దాఖలు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

Supreme Court Verdict Sparks Major APSEC Deliberations on Elections Across 19 Municipalities Hold Meeting

ప్రధానంగా భద్రతా వ్యవహారాలపై ఐజీ రాజకుమారితో ప్రత్యేకంగా సమీక్షించారు ఎస్ఈసీ. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా నామినేషన్లు దాఖలు చేయడానికి అవసరమైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని స్పష్టం చేశారు. అల్లర్లు, దాడులు చోటు చేసుకున్న 19 మున్సిపాలిటీల జాబితాను ఎస్ఈసీ విడుదల చేసింది.

59 మంది పోలీసుల వివరాలను ఎస్ఈసీకి అందజేసిన వైసీపీ
59 మంది పోలీసుల వివరాలను ఎస్ఈసీకి అందజేసిన వైసీపీ

వీటిల్లో.. పిడుగురాళ్ల మున్సిపాలిటీ

గురజాల నగర పంచాయతీ

దర్శి నగర పంచాయతీ

పుంగనూరు మున్సిపాలిటీ

మైదుకూరు మున్సిపాలిటీ

కమలాపురం నగర పంచాయతీ

యర్రగుంట్ల నగర పంచాయతీ

రాయచోటి మున్సిపాలిటీ

దాచేపల్లి నగర పంచాయతీ

గుత్తి మున్సిపాలిటీ

కడప మున్సిపల్ కార్పొరేషన్

రాజంపేట మున్సిపాలిటీ

పులివెందుల మున్సిపాలిటీ

బద్వేల్ మున్సిపాలిటీ

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ

కనిగిరి నగర పంచాయతీ

తాడిపత్రి మున్సిపాలిటీ

జమ్మలమడుగు నగర పంచాయతీ ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+