ఏపీ అసెంబ్లీ కార్యదర్శిగా తెలంగాణ సలహాదారు..!?

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొత్త ప్రభుత్వలో కీలక స్థానాల్లో నియామకాల పైన ఫోకస్ చేసారు. పాలనా పరంగా పలు మార్పులు చేసిన చంద్రబాబు ఇప్పుడు అసెంబ్లీ కార్యదర్శి నియామకంగా లో అనూహ్య ఎంపిక చేసారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సలహాదారుగా ఉన్న సూర్యదేవర ప్రసన్న కుమార్ ను ఏపీ అసెంబ్లీ ప్రత్యేక కార్యదర్శి హోదాలో నియామకానికి రంగం సిద్దం అయినట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ కార్యదర్శిగా
ఏపీ అసెంబ్లీ కార్యదర్శిగా పని చేసిన రామాచార్యులు తాజాగా తన పదవికి రాజీనామా చేసారు. కొత్త స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎంపిక తరువాత తొలి నిర్ణయం వేళ..రామాచార్యులు వ్యవహార శైలి పైన విమర్శలు వచ్చాయి. కాగా, రెండు రోజుల క్రితం ఆయన రాజీనామా చేసారు. ఇప్పుడు అసెంబ్లీకి కొత్త కార్యదర్శి ఎంపిక పైన చర్చ సాగుతోంది. తెలంగాణలో రేవంత్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఏరికోరి సూర్యదేవర ప్రసన్నకుమార్ ను అసెంబ్లీ వ్యవహారాల సలహాదారుగా ఎంపిక చేసుకున్నారు. ప్రసన్నకుమార్ కు శాసన వ్యవహారాల్లో అనుభవం..పట్టు ఉంది.

Suryadevara Prasannakumar likely to appoint as AP Assembly Special Secretary

ఏపీ ప్రభుత్వం నిర్ణయం
ప్రసన్న కుమార్ గతంలో లోక్ సభ స్పీకర్ దగ్గర ఓఎస్డీగా, ఉప రాష్ట్రపతి కార్యాలయంలో డైరెక్టర్ గా పని చేసి ఉండటంతో తెలంగాణ సీఎం రేవంత్ ఆయన వైపు మొగ్గు చూపారు. ప్రస్తుతం ఆయన్ను ఏపీ అసెంబ్లీ ప్రత్యేక కార్యదర్శిగా రావటం దాదాపు ఖాయమైనట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ కార్యదర్శిగా వైసీపీ ప్రభుత్వం రామాచార్యులను కొనసాగించింది. తాజాగా ఆయన రాజీనామా చేసయటంతో ప్రస్తుత ప్రభుత్వం సూర్యదేవర ప్రసన్న కుమార్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

Suryadevara Prasannakumar likely to appoint as AP Assembly Special Secretary

నియామకం పై కసరత్తు
సూర్యదేవర ప్రసన్న కుమార్ ను తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు తీసుకురావలనే ప్రతిపాదన వెనుక ఢిల్లీ స్థాయిలో కీలక పదవుల్లో పని చేసిన ప్రముఖుడి ప్రమేయం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఈ నియామకానికి సంబంధించి కసరత్తు కొనసాగుతున్నట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు జారీ అవుతాయని తెలుస్తోంది. చివరి నిమిషంలో అనూహ్య మార్పు జరిగితే మినహా ఏపీ అసెంబ్లీ ప్రత్యేక కార్యదర్శిగా సూర్యదేవన ప్రసన్న కుమార్ నియామకం దాదాపు ఖయంగానే కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+